ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలేంటో తెలుసా..?

వారిలో ఎన్టీఆర్ అయితే తనని అడిగిన ప్రతి ఒక్కరికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.

Update: 2025-02-13 15:46 GMT

ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. స్టార్ క్రేజ్ ని వాడుకునేలా వారి వాయిస్ ని కొన్ని సినిమాలకు వాడుతుంటారు. వాటి వల్ల సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. స్టార్ హీరోలంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటారు. వారిలో ఎన్టీఆర్ అయితే తనని అడిగిన ప్రతి ఒక్కరికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో టీజర్ లేదా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వస్తే ఆ గ్లింప్స్ కి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడుతుంది. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతున్నా కూడా ఇప్పుడు మరింత ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాకు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడు ముందుంటాడు. తారక్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకు రాం ఇంట్రడక్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయి లేకపోయినా ఆ సినిమా టీజర్ టైం లో ఇంప్రెస్ చేసింది.

ఇక నెక్స్ట్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన RRR సినిమా కి రిలీజ్ చేసిన ప్రోమో లో కూడా రామ్ చరణ్ రామరాజు పాత్రని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పాడు. RRR సినిమా లో తారక్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన విరూపాక్ష సినిమా టీజర్ కి కూడా ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చాడు.

లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ టీజర్ ని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది సీక్రెట్ గా ఉంచినా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమాకు కావాల్సిన మాస్ ఎలివేషన్ ఇచ్చేశాడు. తారక్ వాయిస్ ఓవర్ తో కింగ్ డమ్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. అందుకే జస్ట్ అలా రిలీజైన టీజర్ 24 గంటల్లో 29 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

ఎన్టీఆర్ నటించడమే కాదు తన వాయిస్ ఓవర్ కూడా అందిస్తూ ఇతర హీరోల సినిమాలకు కూడా సపోర్ట్ గా ఉంటున్నాడు. విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అదుర్స్ అనిపించగా ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News