తారక్ ఇష్టం లేకపోయిన ఆ సీన్ చేసాడంట

గ్లోబల్ ఇమేజ్ దిశగా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-06-03 13:30 GMT

గ్లోబల్ ఇమేజ్ దిశగా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ప్యాక్డ్ కథాంతంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక జూనియర్ కెరీర్ కు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీస్ ఏంటనేది చూసుకుంటే టెంపర్ కచ్చితంగా కనిపిస్తుంది. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ క్యారెక్టరైజేషన్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. రెగ్యులర్ గా పాజిటివ్ సైడ్ లోనే తారక్ ని చూసిన ఫ్యాన్స్ కి టెంపర్ లో కొత్త యాంగిల్ కనిపించింది. అతని పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు.

బండ్ల గణేష్ కి ఈ మూవీ భారీ లాభాలు తీసుకొచ్చింది. టెంపర్ తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించిన ఆడియన్స్ తనని రిసీవ్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ తారక్ కి వచ్చింది. అందుకే జై లవకుశ సినిమాలో ఒక పాత్రలో క్రూరమైన విలన్ గా నటించాడు. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి చాలా డౌట్స్ ఉన్నాయంట. మూవీలో ఒక సీన్ అయితే అయిష్టంగానే చేశారట.

ఇందులో తనికెళ్ళ భరణిని బెదిరించి ఆస్తిని రాయించుకుని సీన్ ఉంటుంది. ఇలాంటి సీన్ లో నటిస్తే ఫ్యాన్స్ తనని యాక్సప్ట్ చేయరని తారక్ భావించాడంట. అయితే రాక్షసుడిగా ఉన్న వాడు హీరోగా మారే విధానం ఎస్టాబ్లిష్ కావాలంటే ఈ స్థాయిలో ఉండాలని చెప్పి ఒప్పించారంట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అయిష్టంగా ఆ సన్నివేశం చేసారంట. ఇక ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ యాంగిల్ లో తారక్ ని రిప్రజెంట్ చేసిన పూరి జగన్నాథ్ సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ కి ప్రోపర్ లింక్ చేస్తూ కథని, క్యారెక్టర్ ని అద్భుతం ఎస్టాబ్లిష్ చేయడంతో మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.

ఏకంగా 43 కోట్ల షేర్ ఈ సినిమా కలెక్ట్ చేసింది. టెంపర్ మూవీలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆరంభంలో అతనిని తిట్టుకున్న ప్రేక్షకులు ఓ రకమైన అసహనానికి గురయ్యారు అయితే తరువాత క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ జరిగినపుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ద్వేషించే స్థాయి నుంచి ప్రేమించే స్థితికి వెళ్తారు. అందుకే మూవీ ప్రేక్షకులకి బాగా క్కనెక్ట్ అయ్యింది.

Tags:    

Similar News