దేవర 'సలార్‌' ఎప్పుడంటే...!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాను చేస్తున్నాడు.

Update: 2024-04-19 04:38 GMT

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాను చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. రెండు పార్ట్‌ లుగా రాబోతున్న దేవర మొదటి పార్ట్‌ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇక దేవర తర్వాత ఎన్టీఆర్‌ తదుపరి సినిమా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఉంటుందనే ప్రకటన గతంలో వచ్చింది. కానీ వార్‌ 2 కి కమిట్‌ అవ్వడంతో నీల్ తో సినిమా కాస్త ఆలస్యం అవ్వబోతుంది. మరో వైపు సలార్‌ 2 కోసం కూడా ప్రశాంత్ నీల్ ఎక్కువ సమయం తీసుకోవాలని భావిస్తున్నాడు.

అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్ కాంబో మూవీ పట్టాలెక్కేది. కానీ ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది చివరికి పట్టాలు ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధంగా ఉందని ఆ మధ్య ప్రశాంత్ నీల్ ప్రకటించాడు.

ఎన్టీఆర్‌ చేస్తున్న దేవర, ప్రశాంత్ నీల్‌ చేసిన సలార్‌ లను మించి వీరి కాంబో మూవీ ఉంటుందని ఫ్యాన్స్ చాలా ధీమాతో ఉన్నారు. యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు ప్రశాంత్ నీల్‌. అలాంటి దర్శకుడికి మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ అయిన ఎన్టీఆర్ జత కలిస్తే ఇంకా ఏమైనా ఉందా... కచ్చితంగా వీరి కాంబో మూవీ వెయ్యి కోట్ల మూవీ అవ్వబోతుంది.

ఈ ఏడాది చివర్లో దేవరను ముగించుకుని ఎన్టీఆర్‌, సలార్‌ ను ముగించుకుని ప్రశాంత్ నీల్‌ ఫ్రీ అయితే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. కనుక 2025 చివర్లో లేదా 2026 ప్రథమార్థంలో వీరి కాంబో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News