నీల్ - ఎన్టీఆర్.. ఇంతకంటే పవర్ఫుల్ టైటిల్ ఉంటుందా..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు.

Update: 2024-05-17 04:42 GMT

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్యాన్స్ అయితే అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. మే 20 న విడుదల కానున్న 'దేవర' సినిమాలోని 'ఫియర్ సాంగ్' తో అసలు బజ్ మొదలు కానుంది. అనిరుధ్ స్వరపరిచిన ఆ సాంగ్ తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తుందనే హోప్స్ తో ఉన్నారు. అయితే ఈ సంతోషం ఇంకా పెంచడానికి మరో విషయం కూడా ఉంది.

'దేవర' తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా గురించి అందరికీ తెలిసిన విషయమే. 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఆ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తప్పకుండా అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికే దేవర సినిమాలో ఘోరమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇదే ఇలా ఉంటే ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ సినిమా మాటలకు అందని రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

ఇక టైటిల్ విషయంలో కూడా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ టైటిల్ కథకు మరియు యాక్షన్ సీక్వెన్సెస్ కు సరిపోయేలా ఉండటంతో, చిత్రయూనిట్ ఈ టైటిల్ పై ఆసక్తిగా ఉందని సమాచారం. 'డ్రాగన్' అనే శక్తివంతమైన టైటిల్ ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ గా సరిపోతుంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి పవర్ హౌసెస్ కలిసినప్పుడు, 'డ్రాగన్' కంటే సరైన టైటిల్ మరొకటి ఉండదు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు మరింత కిక్ ఇస్తుంది. అంతే కాకుండా, ఈ టైటిల్ మరియు ప్రీ-లుక్ పోస్టర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 న విడుదల చేయాలని యూనిట్ భావిస్తోందట. ఈ టైటిల్ నిజంగా ఖరారైతే, ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా సంతోషిస్తారు.

అభిమానుల ఊహలను దాటిపోయేలా ఉన్న 'డ్రాగన్' టైటిల్ నిజంగా సెట్టయితే ఈ సినిమా, విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 'దేవర' సినిమా నుండి 'ఫియర్ సాంగ్' విడుదలతో పాటు, ఈ కొత్త ప్రాజెక్టు గురించి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి డ్రాగన్ అనే ఆ కొత్త టైటిల్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టు మొదలవ్వడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టేలా ఉంది. ముందుగా నీల్ ప్రభాస్ తో సలార్ 2 ని ఫినిష్ చేయనున్నాడు. ఇక ఈ లోపు ఎన్టీఆర్ దేవర 1తో పాటు వార్ 2 షూట్ ఫినిష్ చేయనున్నాడు.

Tags:    

Similar News