ఇటలీలో 3రోజుల పెళ్లిపై అధికారిక లేఖ!
30 అక్టోబర్ అంటే సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ ఘనంగా ముగిసింది. దీంతో పాటు గ్రాండ్ మెగా వెడ్డింగ్ ఆచారాలు ఈరోజు ప్రారంభమవుతాయని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన లేఖ వెల్లడించింది.
ఇటలీ టుస్కానీలో 3రోజుల పెళ్లికి సంబంధించిన అధికారిక లేఖ విడుదలైంది. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రిన్సెస్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక నవంబర్ 1న 2.48 పీఎం దివ్యముహూర్తాన జరగనుంది. అంతకంటే రెండ్రోజుల ముందే కాక్ టైల్ పార్టీ వగైరా పూర్తవుతాయని కూడా ఈ లేఖలో వెల్లడించారు.
30 అక్టోబర్ అంటే సోమవారం రాత్రి కాక్ టైల్ పార్టీ ఘనంగా ముగిసింది. దీంతో పాటు గ్రాండ్ మెగా వెడ్డింగ్ ఆచారాలు ఈరోజు ప్రారంభమవుతాయని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన లేఖ వెల్లడించింది. 31 అక్టోబర్ హల్దీ, మెహందీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న పెళ్లి, రిసెప్షన్ జరుగుతాయి. దేవుడు ఈ జంటను ప్రేమ, ఆనందంతో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అంటూ .. దీవెనలు అందించారు పెద్దలు.
పెళ్లి వేడుకకు సంబంధించిన సమస్థ సమాచారంతో లేఖ ఎంతో కళాత్మకంగా ముస్తాబై కనిపించింది. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇప్పటికే పెళ్లి జరిగే వెన్యూ వద్దకు చేరుకున్నారు. వరుణ్ - లావణ్య తో పాటే నాగబాబు అండ్ కొణిదెల ఫ్యామిలీ జాలీ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదలయ్యాయి. మెగా జంట గ్రాండ్ వెడ్డింగ్ వేడుక కోసం ఇటలీలోని బోర్గో శాన్ ఫెలిస్ ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి సెలబ్రిటీలతో సందడి మరో లెవల్ కి చేరనుంది.