'ఈగల్' కోసం ఆ సినిమాను బలి చేస్తారా?
సంక్రాంతికి రావాలి అనుకున్న రవితేజ 'ఈగల్' సినిమా ను పెద్ద నిర్మాతలు అందరూ కలిసి వాయిదా వేయించారు
సంక్రాంతికి రావాలి అనుకున్న రవితేజ 'ఈగల్' సినిమా ను పెద్ద నిర్మాతలు అందరూ కలిసి వాయిదా వేయించారు. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నందుకు గాను ఈగల్ సినిమాను దిల్ రాజు బంపర్ ఆఫర్ ప్రకటించిన విషయం తెల్సిందే. సోలో రిలీజ్ కి సహకరిస్తామని హామీ ఇచ్చాడు.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న రవితేజ ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9వ తారీకు విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు త్యాగం చేసినందుకు గాను అప్పుడు ఆ తేదీన సోలో రిలీజ్ కు అంతా కూడా సహకరించాలని అంటూ నిర్మాతలు తీర్మానం చేశారు.
ఫిబ్రవరి 9న రవితేజ ఈగల్ రాబోతున్న నేపథ్యంలో గతంలోనే ఆ తేదీకి ఫిక్స్ అయిన టిల్లు స్వైర్ వాయిదా పడబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మాత్రమే కాకుండా మరో క్రేజీ మూవీ కూడా ఆ రోజున రావాల్సి ఉండగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సందీప్ కిషన్ హీరోగా ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఊరు పేరు భైరవ కోన సినిమా ను చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు వేసి ఎట్టకేలకు ఫిబ్రవరి 9న విడుదల చేయాలని అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఈగల్ దెబ్బ పడింది.
ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఊరు పేరు భైరవ కోన సినిమా ఇప్పుడు డేట్ మిస్ అయితే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సమ్మర్ లో పెద్ద సినిమాలు, క్రేజీ సినిమా లు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. కనుక భైరవకోన సినిమా కు మంచి తేదీ లభించే అవకాశాలు కష్టమే అన్నట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఈగల్ ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడం ద్వారా పలు సినిమాల విడుదల తేదీల విషయంలో గందరగోళం క్రియేట్ అయింది. అంతే కాకుండా చిన్న సినిమా అయిన ఊరు పేరు భైరవ కోన ను బలి చేసినట్లు అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.