ఆడియెన్స్​ను బురిడి కొట్టిస్తున్న ఓటీటీ

ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు.. షారుక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబరు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అన్నీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది.

Update: 2023-11-03 04:47 GMT

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్​ఫామ్స్​​ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా తెరకెక్కిన సినిమా, సిరీస్​లు ఇంట్లోనే కూర్చొని చూసేస్తున్నాం. దీంతో సినిమా బిజినెస్ మార్కెట్ పరిధి కూడా బాగా పెరిగింది. అయితే ఇండియాలో ఓటీటీలో ప్లాట్​ఫామ్​లు తమ మార్కెట్​ పరిధి పెంచుకునేందుకు జిమ్మిక్క్​లు ప్లే చేస్తూ ఆడియెన్స్​ను మోసం చేస్తున్నాయి!

వివరాళ్లోకి వెళితే.. షారుక్‌ ఖాన్‌ - అట్లీ కాంబో యాక్షన్‌ థ్రిల్లర్‌ జవాన్‌.. సెప్టెంబరు 7న రిలీజై ఘన విజయంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లను అందుకుంది. షారుక్‌ డబుల్ రోల్, యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు.. షారుక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబరు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అన్నీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే ఈ మధ్య.. థియేటర్‌లో నిడివి సమస్య తలెత్తకుండా కత్తిరించిన అదనపు సన్నివేశాలను కూడా ఓటీటీలో జోడిస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు థియేటర్‌ కోసం 169 నిమిషాల నిడివి గల సినిమాను ప్రదర్శిస్తే, ఓటీటీలో ఆ సమయం ఇంకాస్త పెంచి ప్రదర్శిస్తున్నారు. జవాన్ విషయంలోనూ అదే జరిగింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఇందులో కాస్త కొసమెరుపు ఉంది. థియేట్రికల్ వెర్షన్​కు ఓటీటీలో అదనంగా జోడించడానికి కేవలం 5 నిమిషాల వ్యత్యాసం మాత్రమే ఉంది. పైగా ఆ మార్పులను క్షుణ్ణంగా గమనిస్తే కానీ కనిపెట్టలేం.

చాలా చిత్రాల విషయాల్లో ఇదే జరుగుతోంది. ఓటీటీ నిర్వాహకులు.. తమ వ్యూవర్ షిప్​ను పెంచుకునేందుకు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. థియేటర్లలో ఆల్రెడీ సినిమా చూసేసిన వారు కూడా మళ్లీ చూడాలని ఇలా చేస్తున్నారు. అదనంగా జోడించిన సన్నివేశాలలో మంచి కంటెంట్​ ఉంటే ఓకే కానీ అందులో మ్యాటర్ ఏమీ ఉండట్లేదు.

ఏదో ఫార్మాలిటీగా యాడ్​ చేసి వాటిని వదులుతున్నారు. ఏం సీన్స్ జత చేశారో అంటూ మరోసారి ఎంతో ఆసక్తి చూసేవారికి అక్కడ నిరాశే మిగులుతోంది. దీన్ని బట్టి ఓటీటీ వారు అదనపు సన్నివేశాల పేరుతో జిమ్మిక్​లు ప్లే చేస్తూ ఆడియెన్స్​ను బురిడి కొట్టిస్తున్నారని అర్థమవుతోంది.

Tags:    

Similar News