సల్మాన్ (X) ప్రభాస్: ఎవరు నిజమైన పాన్ వరల్డ్ స్టార్?
ప్రతి ఒక్కరికి నిరూపించుకునేందుకు ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కి అలాంటి అరుదైన అవకాశం వచ్చింది
ప్రతి ఒక్కరికి నిరూపించుకునేందుకు ఒక అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కి అలాంటి అరుదైన అవకాశం వచ్చింది. అతడు సల్మాన్ భాయ్‌ని ఢీకొట్టి, బాక్సాఫీస్ పోరులో రారాజు తానేనని నిరూపించాల్సి ఉంటుంది. సల్మాన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైగర్ 3 రికార్డుల్ని బీట్ చేసి ప్రభాస్ 'సలార్' సరికొత్త రికార్డుల్ని సృష్టించాల్సి ఉంటుంది. నిజానికి ఇది ప్రభాస్ కి ఒక అరుదైన అవకాశం. తాను కేవలం బాహుబలి స్టార్ గా హవా చాటుతున్నాడనే అపవాదును కూడా అతడు వదిలించుకోవాల్సి ఉంటుంది. బాహుబలి 1 - బాహుబలి 2 చిత్రాల తర్వాత ప్రభాస్ ని వరుస పరాజయాలు నిరాశపరిచాయి. అతడు సలార్ తో గ్రేట్ కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇండియాలోనే అత్యంత క్రేజీ స్టార్ గా వెలిగిపోతున్న సల్మాన్ ఖాన్ తో పోటీపడి తన సినిమాని విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిన్నటిరోజున ప్రభాస్ 'సలార్' వాయిదా పడిందనే వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో నిర్మాతలు తమ సినిమాల రిలీజ్ తేదీల్ని మార్చుకున్నారు. సలార్ సెప్టెంబర్ రిలీజ్ నుంచి బయటపడింది అని తెలియగానే కోలీవుడ్‌లో రెండు తమిళ చిత్రాలు వెంటనే ప్రతిస్పందనగా సెప్టెంబర్ 28ని విడుదల తేదీగా నిర్ణయించాయి.
హిందీ సినిమాల రిలీజ్ తేదీలు మారాయి. సలార్ నిర్మాతలు నవంబర్ విడుదల తేదీని పరిశీలిస్తున్నట్లు తెలియగానే సల్మాన్ ఖాన్ అలెర్టయ్యాడు. 'టైగర్ 3' విడుదల తేదీని ధృవీకరిస్తూ కొత్త పోస్టర్‌ను అతడి బృందం రూపొందించింది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదల తేదీని ముందే ప్రకటించింది. నవంబర్‌లో సలార్ విడుదల ప్లాన్‌ను అనుసరించి 'టైగర్ 3' మేకర్స్ నవంబర్ 10 విడుదల తేదీగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇప్పుడు సలార్ టీమ్ ఏం ఆలోచిస్తోంది? సల్మాన్ భాయ్ కి ఎదురెళ్లి ఫైట్ చేయాలని నిర్ణయిస్తారా? టైగర్ 3తో పోటీపడేందుకు ప్రభాస్ సిద్ధంగా ఉన్నాడా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. రెండు భారీ సినిమాల క్లాష్ ఇరు సినిమాలకు నష్టాన్ని కలిగిస్తుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల షేరింగ్ చాలా ఇబ్బందికరం. కానీ దీపావళి రేసులో సెలవుల్ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు సలార్ ని రిలీజ్ చేయాలనే నిర్మాతలు భావిస్తున్నారా? అన్నది వేచి చూడాలి. ఇప్పటికి ఇంకా సలార్ విడుదల తేదీని ప్రకటించలేదు. నిర్మాతలు ఇంకా అధికారిక రిలీజ్ తేదీని వెల్లడించాల్సి ఉంది. నవంబర్ లోనే విడుదల చేస్తారా? లేక మరో తేదీకి వెళతారా? అన్నది ఇంకా సస్పెన్స్.
అయితే సల్మాన్ భాయ్ తో ఢీకొట్టి సత్తా చాటితేనే ప్రభాస్ సిసలైన పాన్ ఇండియా స్టార్ లేదా పాన్ వరల్డ్ స్టార్ అని నిరూపించినట్టు అంటూ ఒక సెక్షన్ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. బాహుబలితో ఫ్లూక్ లో వెళ్లిపోతున్న స్టార్ గా మిగిలిపోకుండా తనకు పాన్ వరల్డ్ క్రౌడ్ ని థియేటర్లకు పుల్ చేసే సత్తా ఉందని నిరూపించాల్సిన సందర్భమిదే. ఇది అరుదైన అవకాశం. దీనిని ప్రభాస్ సద్వినియోగం చేయాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే దీపావళి రిలీజ్ ని ప్రభాస్ టార్గెట్ చేస్తాడనే అంతా భావిస్తున్నారు.