పరిణితి పరిణయం గెస్ట్ లు ఇంతమందా?
బాలీవుడ్ నటి పరిణితో చోప్రా- ఎంపీ రాఘవ్ చద్దా వివాహం ఈనెల 24 ఘనంగా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే
బాలీవుడ్ నటి పరిణితో చోప్రా- ఎంపీ రాఘవ్ చద్దా వివాహం ఈనెల 24 ఘనంగా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో లీలా ప్యాలెస్ అందుకు వేదికైంది. ఇప్పటికే వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. పరిణితి-రాఘవ్ కోసం పెళ్లి పీఠలు ఎదురు చూస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు..స్నేహితులు..సన్నిహితులు..కావాల్సిన వారంతా వేదిక వద్దకు చేరుకున్నారు.
తాజాగా పరిణితి-రాఘవ్ చద్దా కూడా ఉదయ్ పూర్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. శనివారం హల్దీ.. మెహందీ.. సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. దానికి సంబంధించి ఏర్పాటు చకచకా జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్లానింగ్ అంతా పక్కాగా ఎగ్జిక్యూట్ అయ్యేలా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. రాఘవ్ చద్దా కు బాగా దగ్గరగా ఉండే స్నేహితులు ఈ పనులన్నింటిని పర్యవేక్షిస్తున్నారుట.
ఈ వివాహానికి 200 మందికి పైగా అతిధులు..50 మందికిపై వీవీఐపీలు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే రాఘవ్ చద్దా ఎంపీ కావడంతోముఖ్యమైన నాయకులు కూడా పెళ్లికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పాట్ లో ప్రత్యేక భద్రతా ఏర్పాటు కూడా చేసినట్లు సమాచారం. అలాగే పరిణితో చోప్రా నటి కాబట్టి ఆమె స్నేహితులు కూడా ఎక్కువ మందే హాజర్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కగలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు..చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక పెళ్లి తర్వాత పరిణితి సినిమాలు చేస్తుందా? లేదా? అన్నది కొద్ది రోజులగా సస్పెన్స్ గా కొనసాగు తుంది. కాబోయే భర్త యాక్టివ్ ఎంపీగా ఉండటంతో సినిమాలు చేయడం కష్టమనే సంకేతాలు అందుతు న్నాయి. పైగా బాలీవుడ్ లో పరిణితి కెరీర్ కూడా ఏమంత బిజీగా లేదు. ఈనేపథ్యంలో ఆమె వివాహం తర్వాత కుటుంబ జీవితానికే అంకితమవుతుందని కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ సంగతి తెలాలంటే కొన్ని నెలలు సమయం పడుతుంది.