గేమ్ చేంజర్… పవన్ కనెక్షన్ నిజమైతే..
ఒకప్పటి శంకర్ మేకింగ్ విజన్, ఐడియాలజీ, సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ చిత్రంలో ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రాబోతున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో మూవీపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒకప్పటి శంకర్ మేకింగ్ విజన్, ఐడియాలజీ, సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ చిత్రంలో ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.
ఇక ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించారు. అయితే ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కార్తీక్ సుబ్బరాజు ఈ కథని శంకర్ కి చెప్పడం, శంకర్ కి బాగా నచ్చడంతో స్క్రిప్ట్ డెవలప్ చేసి రామ్ చరణ్ తో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ కథ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రాసుకున్న ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాలలో చాలా సంఘటనలు తెరపై కనిపిస్తాయని దిల్ రాజు చెప్పారు.
‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. తప్పుడు మార్గంలో ముఖ్యమంత్రి అయిన ఎస్ జె సూర్యకి, ఐఏఎస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ కి మధ్య నడిచే సోషల్ వార్ గా ఈ మూవీ కథాంశం ఉండబోతోందని ట్రైలర్ తో కొంత క్లారిటీ వచ్చింది. అలాగే చిత్రంలో రామ్ చరణ్ అప్పన్న అనే మరో పాత్రలో కూడా కనిపించాడు. అవినీతి రాజకీయ నాయకులకి ఎదురు తిరిగి సొంతగా అభ్యుదయ పార్టీ పెట్టిన సామాన్యుడిగా అప్పన్న క్యారెక్టర్ ఉండబోతోంది.
ఈ పాత్రకి మంచి ఎమోషనల్ స్టోరీ ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్, అలాగే సినిమాలో అభ్యుదయ పార్టీ ప్రస్తుతం ఏపీలో అధికారంలో భాగస్వామ్యం అయిన జనసేన సిద్ధాంతాలకి దగ్గరగా ఉంటుందని జనసైనికులు అనుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా రిలేటెడ్ సన్నివేశాలు ఉంటాయని బలంగా నమ్ముతున్నారు. నిజంగా పవన్ పొలిటికల్ పాయింట్స్ సినిమాకు దగ్గరగా ఉంటే మాత్రం కిక్కు మామూలుగా ఉండదని చెప్పవచ్చు.
అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇది కూడా ‘గేమ్ చేంజర్’ మూవీని మెగా, పవర్ స్టార్ అభిమానులతో పాటు జనసైనికులందరూ మరింత ఓన్ చేసుకోవడానికి కారణం అయ్యింది. రామ్ చరణ్ కెరియర్ లో మొదటిసారి పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేశాడు. కచ్చితంగా సామాజిక, రాజకీయ అంశాలు ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నారు.
కొందరిని హర్ట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. శంకర్ విజన్ అయితే చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. అతను తెలుగు రాజకీయాలని దృష్టిలో ఉంచుకొని సంభాషణలు రాసి ఉంటారనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఈ చిత్రం ఎవరికి ఇష్టంగా ఎవరికి అయిష్టంగా మారుతుందనేది తెలియాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే.