మెగా హీరోల మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఇదే స్పీచ్ లో మెగా హీరోల మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నకు కూడా సమాధానం లభించింది.
''మన మూలాల్ని మర్చిపోకూడదు!'' అంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేదికపై ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ అందరిలో స్ఫూర్తిని రగిలించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సహా దేశ విదేశాల్లో, ఇండియన్ డాయాస్పోరా(దేశీయులు నివశించే అన్నిచోట్లా)లో నివశించే పవన్ అభిమానులు ఈ స్పీచ్ తో గొప్ప స్ఫూర్తిని పొందారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదే స్పీచ్ లో మెగా హీరోల మూలాలు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్నకు కూడా సమాధానం లభించింది. నిజానికి పవన్ కళ్యాణ్.. ఆర్సీ లాంటి హీరోలు ఉన్నారంటే కచ్ఛితంగా చిరంజీవి ఉన్నారు గనుకే. అలాంటి కీలక వ్యక్తి మూలాలు ఎక్కడో ఒక చిన్న పల్లెలో ఉన్నాయి. మొగల్తూరు అనే కుగ్రామంలో, నర్సాపూర్ వైఎన్ కాలేజ్ లో చదువుకుని.. ఆపై తెలుగు సినీపరిశ్రమలో స్టార్ అయ్యారు చిరంజీవి.. అని పవన్ కల్యాణ్ తమ మూలాల గురించి ప్రస్థావించారు. కళ్యాణ్ బాబు అనండి..ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి.. ఏదన్నా మూలాలకు ఆద్యుడు ఆయనే .. నేను మూలాలను మర్చిపోను.. అని పవన్ ఈ వేదికపై వ్యాఖ్యానించారు.
అలాగే సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంత హార్డ్ వర్క్ చేసారో కూడా పవన్ తెలిపారు. అన్నయ్య షూటింగులు చేసి అర్థరాత్రి ఇంటికి చేరుకునేవారని, ఆ సమయంలో అలాగే సోఫాలో నిదురించేవారని, కనీసం షూస్ - సాక్స్ కూడా తీసుకునే ఓపిక ఉండేది కాదని అన్నారు. దాంతో అన్నయ్య సాక్స్ విప్పి తనకు ఆ చిన్న సాయం చేసేవాళ్లమని కూడా పవన్ తెలిపారు. అన్నయ్య కష్టాలు చూసి రామ్ చరణ్ పెరిగాడని, అందుకే అతడు ఎంతో ఒదిగి ఉంటాడని కూడా పవర్ స్టార్ వ్యాఖ్యానించారు. చరణ్ నటించిన భారీ చిత్రం `గేమ్ ఛేంజర్` సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుండగా పవన్ ప్రచారం పెద్దగా కలిసి రానుంది.