పొంగల్ వార్.. లెక్కలు ఎలా ఉన్నాయంటే..!
ఇక అదే రోజు హనుమాన్ సినిమా కూడా వస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు
సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల పండుగ షురూ అయినట్టే. కొత్త ఏడాది మొదటి పండుగ అదే టైం లో అభిమాన హీరో సినిమా రిలీజైతే చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహ పడుతుంటారు. సంక్రాంతికి స్టార్ సినిమాల మధ్య పోటీ తెలిసిందే. ఈ సంక్రాంతికి మహేష్, వెంకటేష్, నాగార్జున లతో పాటుగా రవితేజ, తేజ సజ్జ సినిమాలు వస్తున్నాయి. నిన్నటిదాకా డౌట్ అనుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా కూడా జనవరి 14న రిలీజ్ లాక్ చేశారు.
ఈ సినిమాల మధ్య పొంగల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా సూపర్ స్టార్ మహేష్ జనవరి 12న వస్తున్నాడు. త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం అంటూ వస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలన్నీ కూడా సినిమాపై భారీ హైప్ తెచ్చాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతికి మోస్ట్ ఎవైటెడ్ మూవీ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉంది గుంటూరు కారం.
ఇక అదే రోజు హనుమాన్ సినిమా కూడా వస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. కంటెంట్ బేస్డ్ సినిమాగా వస్తున్న ఈ సినిమా అదే నమ్మకంతో పొంగల్ ఫైట్ కి స్టార్ తో ఢీ కొడుతుంది. జనవరి 13న విక్టరీ వెంకటేష్ సైంధవ్ కూడా వస్తుంది. వెంకటేష్ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న మాస్ సినిమాగా సైంధవ్ వస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ మాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుంది.
శైలేష్ కొలను ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. జనవరి 13న మాస్ మహరాజ్ రవితేజ ఈగల్ కూడా పొంగల్ వార్ లో దిగుతుంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో స్టార్ ఫైట్ కి రెడీ అయ్యింది. ఇక సంక్రాంతికి తను కూడా రెడీ అంటూ వస్తున్నాడు కింగ్ నాగార్జున.
విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన నా సామిరంగ సినిమా వస్తుంది. పక్కా సంక్రాంతి సినిమాగా నాగార్జున నుంచి వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. నాగార్జున ని కూడా ఇలాంటి మాస్ సినిమాలో చూసి చాలా రోజులు అవుతుంది. సో సంక్రాంతికి నా సామిరంగ మీద కూడా భారీ హైప్ వచ్చింది.
ఈ సినిమాల మధ్య గట్టి పోటీ జరుగుతుండగా వీటిలో ఏ సినిమా విజయ పతాకాన్ని ఎగరవేస్తుంది అన్నది చూడాలి. సంక్రాంతికి ఎలాగు హాలీడేస్ కాబట్టి ఎన్ని సినిమాలు వచ్చినా సరే థియేటర్స్ కళకళలాడతాయని చెప్పొచ్చు.