ఆరు నెలలకో సమస్య..అలాగని ఏడుస్తూ కూర్చోలేదు!
బాలీవుడ్ సీనియర్ నటి పూజాబేడి సుపరిచితురాలే. 1990 లో` చిట్టెమ్మ మొగుడు`లో నటించారు.
బాలీవుడ్ సీనియర్ నటి పూజాబేడి సుపరిచితురాలే. 1990 లో` చిట్టెమ్మ మొగుడు`లో నటించారు. అటుపై మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `శక్తి`లో నటించారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ కొన్ని సినిమాలు చేసారు. మూడు దశాబ్దాల కెరీర్ లో ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువే. సీనియర్ నటి అనే పేరు తప్ప కెరీర్ మొత్తంలో ఓ పది సినిమాల్లో నటించారు. బాలీవుడ్ లో కొన్ని టెలివిజన్ షోస్ హోస్ట్ చేసారు.
ఇక గత నాలుగేళ్లగా టీవీ, సినిమా రెండింటికి దూరంగా ఉంటున్నారు. ఇక తెలుగు సినిమా మాట అయితే లేనే లేదు. ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిచిందనే అంతా భావిస్తున్నారు. అయితే తాజాగా పూజాబేడి హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ తో ఉన్న బాండింగ్ ని గుర్తు చేసుకున్నారు. `షూటింగ్ సమయంలో ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేసే దాన్ని చార్మినార్ గల్లీ గల్లీ తిరిగాను.
గాజుల దుకాణాలు ఎంతో బాగుంటాయి. హైదరాబాద్ ధమ్ బిర్యానీకి వీరాభిమానిని. ఇక్కడ సలాడ్స్ అంతే రుచిగా ఉంటాయి. హాలీం ఇంకా స్పెషల్. ఇక్కడ దొరికినంత టేస్ట్ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు. ముంబైకి పెద్ద పెద్ద బాక్సుల్లో పారిల్స్ వచ్చేవి. తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం అన్నా ఎంతో ఇష్టం` అన్నారు. అలాగే తాను సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని తెలిపింది. నటిగా ఇటు వైపు వస్తానని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది.
అయితే కొన్నాళ్లగా ఫ్యామిలీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. ఆరు నెలలకొసారి చెడు వార్త వినాల్సి వస్తోంది. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయాను. నా తమ్ముడికి ఓ సమస్య వచ్చి పడింది. నేను ఇష్టపడే కుక్క చనిపోయింది. నాకు విడాకుల సమస్య. అలాగని నేనెప్పుడు ఏడవలేదు. విచారిస్తూ కూర్చోలేదు. ఆత్మస్తైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కున్నాను. సమస్యలు అందరికీ ఉంటాయి. వాటిని జీవితంలో చిన్న భాగంగానే చూడాలి` అని తెలిపింది.