పొట్టి డ్రెస్సులో పూజా హెగ్డే.. స్టన్నింగ్ స్టైల్

రాధేశ్యామ్ తర్వాత పూజా హెగ్డే కోలీవుడ్ లో విజయ్ కి జోడీగా బీస్ట్ మూవీలో నటించింది.

Update: 2024-08-29 04:12 GMT

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగులో చివరిగా ఆచార్య సినిమాలో కనిపించింది. అంతకంటే ముందుగా రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించింది ఆ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో పూజా హెగ్డే నటించి మెప్పించింది. ప్యూర్ లవ్ స్టోరీగా రాధాకృష్ణ ఆ చిత్రాన్ని తెరకెక్కించడంతో పూజా హెగ్డే క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేశారు. రాధేశ్యామ్ తర్వాత పూజా హెగ్డే కోలీవుడ్ లో విజయ్ కి జోడీగా బీస్ట్ మూవీలో నటించింది.


ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య మూవీ అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. దీని తర్వాత హిందీలో సర్కస్ లో రణవీర్ సింగ్ కి జోడీగా కనిపించింది. అలాగే కిసిక భాయ్ కిసికి జాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ తో జతకట్టింది. ఈ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఆ తరువాత ఏదో ప్రమాదం కారణంగా కాళ్లకి దెబ్బ తగలడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంది. అదే సమయంలో గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుంది.


అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ కూడా పూజా హెగ్డే నుంచి శ్రీలీల చేతికి వెళ్ళిపోయింది. ఇలా వరుస దెబ్బల కారణంగా పూజా హెగ్డేకి అవకాశాలు కూడా తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఈ బ్యూటీ కనిపించలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఏవీ కన్ఫర్మ్ కాలేదు. హిందీలో దేవ అనే మూవీలో షాహిద్ కపూర్ కి జోడీగా నటిస్తోంది. అలాగే తమిళంలో సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.


ఈ అమ్మడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాకున్న కూడా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తనకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్స్ న కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ బ్యూటీకి 27.3 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ స్టాగ్రామ్ లో ఉన్నారు.


ఈ కారణం పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి ఫోటో పెట్టిన లక్షల్లో లైక్స్ వస్తాయి. ఇక ఈ అమ్మడు గ్లామర్ పిక్స్ పంచుకుంటే వాటికి ఇంకా ఎక్కువ లైక్స్, కామెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ లాస్ ఏంజిల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ బీచ్ లో ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ చల్లగాలిలో విహరిస్తోంది. ఈ పిక్స్ ని పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆమె గ్లామర్ పిక్స్ కి లవ్ సింబల్స్ లో ఫ్యాన్స్ తమ రియాక్షన్స్ తెలియజేస్తున్నారు. ఫోటోలని ఏకంగా 6.82 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

Tags:    

Similar News