అమెరికా యాత్ర‌లో స్ట‌న్నింగ్ పూజా హెగ్డే

కెరీర్ ని, వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.

Update: 2024-08-31 03:44 GMT

కొంత కాలంగా టాలీవుడ్ లో పూజా హెగ్డే సౌండ్ లేదు. ఇక్క‌డ ఆశించిన అవ‌కాశాల్లేవ్. దీంతో ఈ బ్యూటీ పూర్తిగా ముంబైకే ప‌రిమిత‌మైంది. అయితే కెరీర్ ప‌రంగా వ‌చ్చిన డోఖా ఏం లేదు.తెలుగులో స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు త‌గ్గినా కానీ, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో స్టార్ల‌తో పూజా అవకాశాలు అందుకుంటోంది. కెరీర్ ని, వ్య‌క్తిగ‌త జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.


ప్రస్తుతం పూజా హెగ్డే తన ఫ్యామిలీతో అమెరికా వెకేషన్‌లో ఉంది. ఈసారి ట్రిప్ చాలా యూనిక్ గా సాగుతోంది. బీచ్‌లో సూర్యాస్తమయాలను వీక్షిస్తూ.. పచ్చని అడవుల గుండా సాగే పర్యటనల నుంచి కొన్ని అంద‌మైన ఫోటోల‌ను షేర్ చేసింది. వీటిలో పూజా ప‌చ్చందాల న‌డుమ కెమెరాకు ఇచ్చిన కొన్ని ఫోజులు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అంతేకాదు.. కొన్ని ఫోటోల‌లో పూజ లాస్ ఏంజిల్స్ సౌంద‌ర్యాన్ని ఎలివేట్ చేసింది. ఓ ఫోటోగ్రాఫ్ లో పొట్టి పోల్కా-డాట్ డ్రెస్, స్లింగ్ బ్యాగ్ తోను క‌నిపించింది. అంతేకాదు అక్క‌డ‌ అడవి గుండా హైకింగ్ చేస్తూ, స్కూకుమ్ ఫ్లాట్‌ల ట్రయల్‌లోని పచ్చదనం మధ్య మనోహ‌రంగా టైమ్ స్పెండ్ చేసింది. డిస్ట్రెస్‌డ్ డెనిమ్ షార్ట్‌లు, తెల్లటి క్రాప్ టాప్, పసుపు గీతలు ఉన్న షర్ట్ .. క్యాప్ ధరించి .. తెల్లని స్నీకర్లతో క‌నిపించింది.


విహార యాత్ర నుంచి పూజా ప్ర‌తి పోస్ట్ టెంప్ట్ చేస్తోంది. వెకేష‌న్ ప్లాన్ చేస్తే అమెరికా వెళ్లిపోవాలి! అన్నంత‌గా ఇవి స్ఫూర్తిని నింపుతున్నాయి. ఇటీవ‌ల స్టార్లు యూరప్ దేశాల‌కు వెళ్లిపోతున్నారు. కానీ అమెరికాలోని సౌంద‌ర్యాన్ని ఆస్వాధించాలనే మ‌న‌సుంటే అక్క‌డ‌ చాలా ఉంది! అనేంత‌గా పూజా ఈ ప్ర‌యాణాన్ని విస్త‌రిస్తోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... త‌దుప‌రి షాహిద్ కపూర్‌తో కలిసి `దేవా` చిత్రంలో పూజా న‌టిస్తోంది. సూపర్ స్టార్ సూర్యతో కలిసి సూర్య 44లో కనిపించనుంది. ఇవే గాక మ‌రో రెండు ప్రధాన దక్షిణ భారత ప్రాజెక్ట్‌లకు సంత‌కాలు చేసింద‌ని తెలుస్తోంది. వాటిని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. బాలీవుడ్ లో స‌ల్మాన్ తో చేసిన `కిసీ కా భాయ్ కిసి కి జాన్` ఫ్లాపైన‌ త‌ర్వాత పూజాకు మ‌రో ఆఫ‌ర్ లేదు.

Tags:    

Similar News