బుట్టబొమ్మ మిస్సైన గుంటూరు కారం లుక్‌ చూశారా?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొంది మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'

Update: 2024-03-04 06:37 GMT
బుట్టబొమ్మ మిస్సైన గుంటూరు కారం లుక్‌ చూశారా?
  • whatsapp icon

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొంది మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌ గా పూజా హెగ్డేను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల బుట్టబొమ్మ పూజా హెగ్డేను గుంటూరు కారం నుంచి తొలగించారు.

సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్న శ్రీ లీలను మెయిన్ హీరోయిన్‌ గా నటింపజేశారు. పూజా హెగ్డే తో ఒకటి రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ కూడా చేశారు అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ లీక్ అవ్వలేదు. సినిమా విడుదల అయిన ఇన్ని రోజులకు పూజా హెగ్డే పిక్ లీక్ అయ్యింది.

పూజా హెగ్డే ను సింపుల్‌ అండ్‌ స్వీట్‌ గా త్రివిక్రమ్‌ గుంటూరు కారంలో చూపించాలని భావించాడు. అందుకు తగ్గట్లుగానే ఆమె లుక్ ను డిజైన్‌ చేశాడని ఈ లీక్ ఫోటోను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఒకే ఫ్రేమ్‌ లో మహేష్ బాబు తో పాటు శ్రీ లీల మరియు పూజా హెగ్డే ను కూడా చూడవచ్చు.

మహేష్ బాబు సినిమా లో పూజా హెగ్డే ఉండి ఉంటే బాగుండేది అంటూ ఆమె అభిమానులు ఈ ఫోటోలు చూసిన తర్వాత మళ్లీ సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలా లీక్ అయ్యింది అనేది క్లారిటీ లేదు కానీ, కొన్ని గంటల్లోనే పూజా హెగ్డే గుంటూరు కారం పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడిపిన పూజా హెగ్డే ఇప్పుడు ఆఫర్లు లేక ఢీలా పడింది. గుంటూరు కారం సినిమాలో నటించి ఉంటే ఫలితం తో సంబంధం లేకుండా కచ్చితంగా మరో రెండు మూడు ఆఫర్లు దక్కించుకునేది. కానీ గుంటూరు కారం నుంచి మధ్య లో తొలగించడం వల్ల కెరీర్‌ మరింతగా ఇబ్బందుల్లో పడింది. బాలీవుడ్‌ లో కూడా ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమీ లేనట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News