ఇటలీ విహారయాత్రలో పూజా ఏం చేసిందో తెలుసా?
అయినా ఇప్పటికీ పూజాకు అవకాశాల పరంగా కొదవేమీ లేవు.
టాలీవుడ్ టు బాలీవుడ్ పూజా హెగ్డే కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. సౌత్ లో అగ్ర కథానాయికగా ఉన్నప్పుడే హిందీ పరిశ్రమలో అవకాశాలు అందుకున్న పూజా అక్కడ పెద్ద కెరీర్ ని ఆశించింది. కానీ దురదృష్ట వశాత్తూ అగ్ర హీరోలతో ఆఫర్లు డిజాస్టర్లుగా మారాయి. దీంతో ప్లాన్లు అన్నీ వికటించాయి. అయినా ఇప్పటికీ పూజాకు అవకాశాల పరంగా కొదవేమీ లేవు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ కోసం సన్నాహకాల్లో ఉంది ఈ భామ.
ఇంతలోనే షాహిద్ కపూర్ సరసన 'దేవా' అనే భారీ యాక్షన్ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టే ముందే ఈ భామ ఇటలీ వెకేషన్ ని తనివితీరా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ఇటలీలో రుచికరమైన వంటకాల్ని ఆస్వాధిస్తున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిలో పాస్తాలు, ఐస్ క్రీమ్ లు ఉన్నాయి. అలాగే వెజ్ నూడిల్స్ .. రొయ్యల వేపుళ్లను తనివితీరా ఆస్వాధించిన సంగతిని ఫోటోల రూపంలో బయటపెట్టింది. వెజ్ నాన్ వెజ్ వెరైటీలను ఆరాంగా లాగించేస్తోంది పూజా.
పూజా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకుముందు పాస్తా-మేకింగ్ సెషన్ తర్వాత పూజా లేటెస్ట్ ఫోటోషూట్ ఇది. మరోవైపు ఈ భామ ఇటలీ వినువీధుల్లో విహరిస్తూ అందమైన లొకేషన్లలో ఫోటోషూట్లను కూడా షేర్ చేస్తోంది. తాజాగా పూజా యాత్ర నుంచి కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేయగా అవి అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. స్టైలిష్ గాగుల్.. సింపుల్ జీన్స్ లో ఈ భామ భారతీయ ట్రెడిషన్ ని ఆవిష్కరించింది ఈ షికార్ లో. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువతరలో వైరల్ గా దూసుకెళుతున్నాయి.
కోలీవుడ్ లో బెస్ట్ :
ఇటీవల పూజా కంబ్యాక్ కోసం టాలీవుడ్ లో దర్శకనిర్మాతలతో మంతనాలు సాగిస్తోందన్న ప్రచారం సాగుతోంది. పూజా హెగ్డే కోలీవుడ్లో తన కెరీర్లో అత్యధిక పారితోషికం తీసుకుంటోందని కూడా ప్రచారం సాగుతోంది. టాలీవుడ్లో ప్రతి చిత్రానికి రూ. 2.5 నుండి 3 కోట్ల మధ్య వసూలు చేసి పూజాకు అంతకుమించి కోలీవుడ్ లో పారితోషికం ముట్టజెబుతున్నారని సమాచారం. మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ , అల్లు అర్జున్ వంటి పెద్ద స్టార్లతో కలిసి పని చేసిన పూజా కోలీవుడ్ లో విజయ్ సరసన అవకాశాలు అందుకుంటోంది. పలువురు కోలీవుడ్ అగ్ర హీరోలు ఈ భామకు అవకాశాలిచ్చారని తెలుస్తోంది. తన తదుపరి ప్రాజెక్టుల గురించి పూజా హెగ్డే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.