హిందీ 'డాకు మహారాజ్'.. బీటౌన్ లో టాక్ ఇలా..
నిజానికి మాస్ మూవీస్.. తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకునేలా నార్త్ ఆడియన్స్ ను మెప్పించలేవ్. కానీ డాకు మహారాజ్ మాత్రం సర్ప్రైజ్ రిజల్ట్ అందుకుంది.
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం థియేటర్లలో డాకు మహారాజ్ మూవీతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 2025 సంక్రాంతి విన్నర్స్ లో ఒకటిగా, బాలయ్య కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచింది.
అయితే సినిమా రిజల్ట్ విషయంలో మేకర్స్ ముందు నుంచి మంచి హోప్స్ తో ఉండగా.. రిజల్ట్ కూడా అంతే రీతిలో వచ్చింది. ఇక ముందు నుంచే హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న మేకర్స్.. తెలుగు రిజల్ట్ తర్వాత పనులు కంప్లీట్ చేశారు. ఇప్పుడు వీకెండ్ కలిసొచ్చేలా శుక్రవారం విడుదల చేశారు.
నిజానికి మాస్ మూవీస్.. తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకునేలా నార్త్ ఆడియన్స్ ను మెప్పించలేవ్. కానీ డాకు మహారాజ్ మాత్రం సర్ప్రైజ్ రిజల్ట్ అందుకుంది. ఊహించని రీతిలో రెస్పాన్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నట్లు నార్త్ ఆడియన్స్ సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ లో సినిమాను ఇంకా ప్రమోట్ చేయాలని మేకర్స్ ను నందమూరి అభిమానులు కోరుతున్నారు. ప్రమోషనల్ మీట్స్ ను నిర్వహించాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. డాకు మహారాజ్ మూవీ రిజల్ట్ పై డైరెక్టర్ బాబీ సోషల్ మీడియాలో స్పందించారు.
నార్త్ లో డాకు మహారాజ్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో వారిని కలవడానికి ఫుల్ ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. తాము నిజంగా కృతజ్ఞులమని పేర్కొన్నారు. అలా హిందీలో భారీగా ప్రమోట్ చేసి ఉత్తరాదిలో కూడా పెద్ద విజయం సాధించాలని మేకర్స్ ఆశిస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రగ్యా జైస్వాల్, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఊర్వశీ రౌతేలా కీలక పాత్ర పోషించి స్పెషల్ సాంగ్ తో మెప్పించారు. ఆమె బాలీవుడ్ బ్యూటీ కావడంతో హిందీ ఆడియన్స్ ను మూవీ ఆకట్టుకోవడానికి ఒక రీజన్ అని చెప్పవచ్చు. మొదటి రోజు సర్ప్రైజ్ టాక్ రాగా.. బాలీవుడ్ వెర్షన్ ఫుల్ రన్ ముగిసే సరికి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.