ది రాజాసాబ్ మ్యూజిక్ రైట్స్ అన్ని కోట్ల?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. హార్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సిద్ధం అవుతోంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడం విశేషం. అలాగే చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో డాన్స్ చేయబోతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకి భిన్నంగా ది రాజాసాబ్ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ తాత క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడంట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రిద్ధి కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఓ విధంగా చూసుకుంటే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అతి తక్కువ బజ్ ఉన్న సినిమాగా ది రాజాసాబ్ ఉంది. అయితే టీజర్ తర్వాత మూవీ పైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ సినిమా గురించి ఇప్పుడో ఇంటరెస్టింగ్ ప్రచారం తెరపైకి వచ్చింది. ది రాజాసాబ్ మూవీ మ్యూజిక్ రైట్స్ ని భారీ ధరకి ఐకాన్ మ్యూజిక్ సౌత్ ఆడియో కంపెనీ కొనుగోలు చేసిందనే మాట వినిపిస్తోంది.
ది రాజాసాబ్ మూవీ ఆడియో రైట్స్ ని 15 కోట్లకి ఐకాన్ మ్యూజిక్ సౌత్ కంపెనీ సొంతం చేసుకుందంట. ఆడియో కంపెనీలలో టి-సిరీస్ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. అన్ని భాషలకి సంబందించిన ఆడియో రైట్స్ ని టి-సిరీస్ బెస్ట్ ధరలు ఆఫర్ చేస్తూ కొనుగోలు చేస్తోంది. టి-సిరీస్ కి పోటీగా కొన్ని కంపెనీలు వచ్చాయి. ఈ మధ్య సౌత్ లో ఐకాన్ మ్యూజిక్ సౌత్ పేరు బాగా వినిపిస్తోంది.
ఈగల్, డెవిల్ లాంటి సినిమాల ఆడియో రైట్స్ ని ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఒకవేళ ది రాజాసాబ్ ఆడియో రైట్స్ ని కూడా ఈ సంస్థ కొనుగోలు చేస్తే మాత్రం కచ్చితంగా వారికి అది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. థమన్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. 100 మిలియన్ వ్యూవ్స్ దాటిన సాంగ్స్ లో థమన్ ఆల్బమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ది రాజాసాబ్ చిత్రానికి కూడా అతను బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.