కల్కి 2898ఏడీలో ఈ లోపాలు సరిచేసుకోవాల్సిందేనా?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కి పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. కచ్చితంగా విజువల్ వండర్ గా ఈ మూవీ ఉండబోతోందని డార్లింగ్ ఫ్యాన్స్ కూడా అంచనా వేస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో ట్రైలర్ కి సాలిడ్ వ్యూస్ వచ్చాయి.
జూన్ 27న వరల్డ్ వైడ్ గా కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అందరికి కాన్ఫిడెన్స్ పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా ప్రేక్షకులు కొన్ని విషయాలలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చిత్ర యూనిట్ కి సలహాలు ఇస్తున్నారు.
ముఖ్యంగా కల్కి ట్రైలర్ లో తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ పలికే విధానంపై పబ్లిక్ అలాగే సినీ విశ్లేషకుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రభాస్ డైలాగ్ డిక్షన్ భాగానున్న అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని డైలాగ్స్ మాత్రం చాలా కృతకంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఏదో హాలీవుడ్ సినిమాకి డబ్బింగ్ చెప్పినట్లు వారి మాట్లాడే విధానం ఉందని అంటున్నారు. తెలుగు వెర్షన్ డబ్బింగ్ విషయంలో నాగ్ అశ్విన్ కాస్తా ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.
అలాగే గ్రావిక్స్ పరంగా కూడా కొన్ని ఫ్రేమ్స్ లో నేచురాలిటీ మిస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసినపుడు బ్యాగ్రౌండ్ స్కోర్, విజువలైజేషన్, ప్రెజెంటేషన్ పరంగా కల్కి ట్రైలర్ హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కనిపిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. కొన్ని నెగిటివ్స్ ని పరిగణంలోకి తీసుకొని సరిచేసుకుంటే కచ్చితంగా ప్రేక్షకులకి విజువల్ ఫీస్ట్ అందించినట్లు అవుతుందనే మాట వినిపిస్తోంది.
రెండు భాగాలుగా కల్కి మూవీని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి పార్ట్ లో భైరవా లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు. సెకండ్ పార్ట్ లో కల్కి ఆగమనం ఉంటుందనే మాట వినిపిస్తోంది. భైరవ, అశ్వద్ధామ మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని భావిస్తున్నారు. వైజయంతీ మూవీ బ్యానర్ లో స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.