వీడియో : ప్రభాస్‌ స్టైలిష్‌ ఎంట్రీ అదుర్స్‌

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది

Update: 2024-06-19 11:31 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడీ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కల్కి సందడి మొదలు అవ్వబోతుంది. ఇప్పటికే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కల్కి కి లైన్ క్లీయర్ చేసి సైడ్‌ అయ్యాయి.

నేడు కల్కి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ముంబై లో నిర్వహిస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులు అందరితో పాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు మరియు మీడియా ప్రముఖులు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కోసం ప్రభాస్ నిన్న సాయంత్రం ముంబై చేరుకున్నాడు. ముంబై ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అయిన ప్రభాస్ వీడియో లు వైరల్‌ అయ్యాయి. ఎప్పటిలాగే చాలా స్టైలిష్‌ లుక్ లో ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ వావ్‌ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కి సాధారణంగానే ఇలాంటి వీడియో లు ఫుల్‌ మీల్స్‌ అనడంలో సందేహం లేదు. అయితే ఇతరులు కూడా ఈ వీడియోలో ప్రభాస్ ను చూసి వావ్‌ అంటూ ప్రశంసలు కురిపించడం ఇక్కడ ప్రత్యేకమైన విషయం గా సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

కల్కి సినిమా ప్రమోషన్ కోసం ముంబైలో స్టైలిష్ ఔట్‌ ఫిట్ లో అడుగు పెట్టిన ప్రభాస్ ను చూసేందుకు అక్కడ ఉండే మీడియా వారితో పాటు పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా పోటీ పడ్డారు. దాంతో ఎయిర్‌ పోర్ట్‌ బయట హడావుడి వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News