లండన్ లగ్జరీ హౌస్ సొంతం చేసుకున్నాడా?
ముఖ్యంగా లండన్ కి వెళ్లినప్పుడు తరుచూ ఓ లగ్జరీ హౌస్ లోనే దిగేవారుట. దానికి కోటి రూపాయలు రెంట్ చెల్లించేవారు.
డార్లింగ్ ప్రభాస్ విదేశాలకు వేకెషన్లకు వెళ్తుంటాడు అన్న సంగతి తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే ఈ మధ్య విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నాడు. అమెరికా..రష్యా..ఇటలీ..జపాన్..న్యూజిలాండ్ అంటూ అన్ని దేశాలు తిరిగేస్తున్నాడు. ఇంతకు ముందులా ఇప్పుడు ఇండియాలో పెద్దగా ఉండటం లేదు. షూటింగ్ లు ఉంటే ? తప్ప లేదంటే విదేశాల్లో డార్లింగ్ అడ్డాగా మారిపోయాయి. ముందు ఆయన ఒక్కడే ఒంటరిగా వెళ్తాడు.
ఆ తర్వాత ఆయన వెనుకలా స్నేహితులు వెళ్తుంటారు. ఈ ప్రాసోస్ చాలా కాలంగా జరుగుతోంది. ఇక ప్రభాస్ ఎక్కడ ఉంటే అక్కడ తన కుక్ వెంట ఉంటాడు? అతడికి కావాల్సిన అన్ని రకాల వంటకాలు వండాలి కాబట్టి కుక్ తప్పనిసరి. విదేశీ వంటకాలు రుచి చూసినా స్వదేశి రుచి తగలనిదే డార్లింగ్ సంతృప్తి ఉండదు. అందుకే కుక్ తప్పనిసరి. ఇక విదేశాలకు వెళ్లిన తర్వాత డార్లింగ్ వారం ..పది రోజులో ఉండి వచ్చేయడు.
నెలలు తరబడి అక్కడే ఉంటాడు. ఎక్కడ దిగినా? భారీగా ఈ ఇంటికి గానీ..హోటల్ కిగానీ అద్దె చెల్లిస్తుంటాడు. ముఖ్యంగా లండన్ కి వెళ్లినప్పుడు తరుచూ ఓ లగ్జరీ హౌస్ లోనే దిగేవారుట. దానికి కోటి రూపాయలు రెంట్ చెల్లించేవారు.
ఆ వాతవరణం...హౌస్ బాగా నచ్చడంతో లండన్ ఎప్పుడెళ్లినా? అదే స్పాట్ లో దిగేవారుట. దీంతో లాభం లేదనుకన్న డార్లింగ్ ఇప్పుడు ఏకంగా ఆ లగ్జరీ ఇంటినే కొనుగోలు చేసాడుట. కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నాడుట.
మరి డార్లింగ్ అ! మజాకానా! కొన్ని విషయాల్లో ప్రభాస్ ఎక్కడా తగ్గడు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ప్రభాస్ అండ్ కోకి ఇప్పటికే విదేశాల్లో రెస్టారెంట్లు..కొన్ని సొంత ఇళ్లు సైతం కలిగి ఉన్నారని గతంలోనే ప్రచారం సాగింది. ఫారిన్ లో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.