సలార్.. మంచి ఆదాయమే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Update: 2023-09-14 05:45 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ సిరీస్ నుంచి సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఇప్పటికే క్లోజ్ అయిపోయాయి. థీయాట్రికల్ బిజినెస్ 500 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరుగుతుందో ఈ సలార్ మీద జరుగుతున్న బిజినెస్ చెబుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో హైప్ ఇంకా ఎక్కువగా ఉంది.

ఈ మూవీకి సంబందించిన నాన్ థీయాత్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయి. అది కూడా రికార్డ్ ధరకి నాన్ థీయాట్రికల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. అన్ని భాషలకి సంబంధించిన డిజిటల్ రైట్స్ తో పాటు ఆడియో రైట్స్ కలుపుకొని 350 కోట్ల రూపాయిలు నిర్మాతకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ 250 కోట్ల వరకు ఖర్చు పెట్టింది.

ఇప్పుడు సలార్ సినిమాకి ఏకంగా 350 కోట్లు ఇస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. ఈ సినిమాకి 400 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ షేర్ వెనక్కి వచ్చేసింది. థియేటర్స్ లో వచ్చేది ఇక అంతా లాభమే అవుతుంది. అయితే డిస్టిబ్యూటర్స్ కి సలార్ సినిమా ఎలాంటి లాభాలు తీసుకొస్తుందనేది మూవీ సక్సెస్ రేంజ్ బట్టి ఆధారపడి ఉంటుంది.

అవుట్ ఫుట్ అనుకున్నట్లు వస్తే నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. మరి సమయానికైనా సినిమాని అందించి అభిమానుల ఆకలి తీరుస్తాడేమో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News