కల్కి కోసం ప్రభాస్‌.. సూపర్‌ అప్‌డేట్‌

ఇప్పుడు కల్కి సినిమా యొక్క షూటింగ్ ను ముగించిన ప్రభాస్ డబ్బింగ్‌ పనులకు రెడీ అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

Update: 2024-03-02 05:57 GMT

సలార్‌ సినిమాతో గత ఏడాది చివర్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ అభిమానులకు చాలా ఊరట కలిగించాడు. వరుసగా మూడు పరాజయాల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సలార్‌ సూపర్‌ డూపర్ హిట్‌ అవ్వడంతో ఆయన ప్రస్తుతం చేస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సోషల్‌ మీడియాలో కల్కి సినిమా గురించి రెగ్యులర్‌ గా ఏదో ఒక వార్త, పుకారు సర్క్యులేట్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు కల్కి సినిమా యొక్క షూటింగ్ ను ముగించిన ప్రభాస్ డబ్బింగ్‌ పనులకు రెడీ అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

తెలుగు తో పాటు మరో రెండు భాషలకు కూడా ప్రభాస్ డబ్బింగ్‌ చెప్తాడు అంటున్నారు. ఆ రెండు భాషలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్‌ వచ్చే వారంలోనే కల్కి సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పబోతున్నాడు. పరిస్థితులను బట్టి రెండు లేదా మూడు రోజుల పాటు కల్కి సినిమా డబ్బింగ్‌ వర్క్ జరిగే అవకాశాలు ఉన్నాయట.

ఇప్పటికే పలువురు నటీ నటులకు సంబంధించిన డబ్బింగ్‌ వర్క్ పూర్తి అయ్యిందని, వచ్చే వారంతో డబ్బింగ్‌ ఫార్మాల్టీస్ అంతా కూడా పూర్తి ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక సినిమా విడుదలే తరువాయి అన్నట్లుగా హడావుడిగా పరిస్థితి ఉంది.

ఇప్పటికే పలు సార్లు వాయిదా పడ్డ కల్కి సినిమాను సెంటిమెంట్‌ డేట్ అయిన మే 9న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్యాచ్‌ వర్క్ మినహా షూటింగ్‌ పూర్తి చేసిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మరో వైపు గ్రాఫిక్స్ వర్క్ విషయంలో మరింత స్పీడ్‌ పెంచాడు.

మార్చి చివరి వరకు సినిమా యొక్క ఫస్ట్‌ కాపీ రెడీ చేసి ఏప్రిల్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసే విధంగా యూనిట్‌ సభ్యులు హడావుడిగా ఉన్నారు. పాన్‌ ఇండియా మించి ఈ సినిమా విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్స్ అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ ఇంకా పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించారు.

Tags:    

Similar News