ఇండియన్ మైకేల్ జాక్సన్.. ఇలా ఊహించలేదు

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-03-28 04:50 GMT

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇటీవల వైజాగ్ లో కీలక షెడ్యూల్ ను పూర్తి చేసిన మేకర్స్.. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇంతలో చరణ్ కొత్త ప్రాజెక్ట్ కూడా మొదలైంది. గేమ్ ఛేంజర్ షూట్ పూర్తయ్యాక ఆర్ సీ 16 సెట్స్ లో ఆయన అడుగుపెట్టనున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ నుంచి అప్పుడెప్పుడో అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. నిన్న జరగండి సాంగ్ ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ రివీల్ చేశారు. ఇప్పుడు నెట్టింట ఈ సాంగ్ కోసం జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పాట ఎంత మందికి నచ్చిందో.. అంతే మంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు కూడా. ఈ సాంగ్ ట్యూన్ కాపీ అంటూ జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీలోని పాటను షేర్ చేస్తున్నారు.

అయితే ఈ సాంగ్ కోసం గేమ్ ఛేంజర్ మేకర్స్.. రూ.16 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సెట్స్ కోసం అంతలా వెచ్చించినట్లు సమాచారం. విజువల్స్ పరంగా ఓకే అయినా.. రామ్ చరణ్ ఫ్యాన్స్ లో చాలా మందికి కొరియోగ్రఫీ నచ్చలేదట. శంకర్- చరణ్ మూవీ సాంగ్ కు ఇలాంటి కొరియోగ్రఫీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా వ్యవహరించిన విషయం తెలిసిందే.

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లో రామ్ చరణ్ ఒకరు. ఎన్నో సాంగ్స్ లో తన స్టెప్పులతో ఫిదా చేశారు. అలాంటి బెస్ట్ డ్యాన్సర్ తో మాస్ సాంగ్ అంటే చాలా అంచనాలు పెట్టుకున్నామని నెటిజన్లు చెబుతున్నారు. అందులోనూ ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు గాంచిన ప్రభుదేవా కొరియోగ్రఫీ కనుక వేరే వెల్ లో ఉంటుందనుకున్నామని అంటున్నారు. కానీ ఈ సాంగ్ లో ప్రభుదేవా మార్క్ అస్సలు కనిపించలేదని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ప్రభుదేవా.. ఈ సినిమా సెట్స్ కు క్యాజువల్ గా వెళ్లారని, అప్పుడు కొన్ని స్టెప్పులు కంపోజ్ చేయమని టీమ్ అడిగందని అంటున్నారు. అందుకే సాంగ్ రిజల్ట్ ఇలా ఉందని చెబుతున్నారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన కొన్ని స్టెప్పులు అస్సలు బాలేదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట కోసమే ట్వీట్లు, మీమ్స్, ట్రోల్స్. మరి మూవీ రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News