ఏ కథ రాసుకున్నా నా మైండ్ లో వచ్చే హీరో తేజ్..!
తేజ్ సంబరాల ఏటిగట్టు టీజర్ రిలీజ్ ఈవెంట్ లో తేజ్ తో పనిచేసిన దర్శకులందరు పాల్గొన్నారు.
తేజ్ సంబరాల ఏటిగట్టు టీజర్ రిలీజ్ ఈవెంట్ లో తేజ్ తో పనిచేసిన దర్శకులందరు పాల్గొన్నారు. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ఈ ఈవెంట్ లో స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఐతే ప్రైం షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన హనుమాన్ దర్శకుడు కాబట్టి ప్రశాంత్ వర్మ ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. ఐతే మైక్ అందుకున్న ప్రశాంత్ వర్మ మెగా ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చెప్పాడు. తాను ఏ కథ రాసుకున్నా నా మైండ్ లో వచ్చే ఫేస్ సాయి దుర్గ తేజ్ అని అన్నారు ప్రశాంత్ వర్మ. ఆయన ఏ కథలో అయినా ఫిట్ అవుతారు. ఫస్ట్ మూవీ చూసి చిరంజీవి మేనల్లుడు చిరంజీవిలా ఉన్నాడని అనిపించింది. నెక్స్ట్ సినిమా పవర్ స్టార్ లా అనిపించాడు.
అక్కడ నుంచి రైజింగ్ అవుతూ వచ్చారు. లైఫ్ లో ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్లీ ఆయన కష్టపడి ఈ సినిమా చేశారు. ఆ బాడీ బిల్డింగ్ అదిరిపోయింది. హనుమాన్ జరుగుతున్న టైం లోనే నిరంజన్ గరు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. దర్శకుడు రోహిత్, నిరంజన్ రెడ్డి గారికి ఆల్ ది బెస్ట్.. ఈ సినిమా హనుమాన్ కన్నా ఎక్కువ హిట్ అవ్వాలని కోరుతున్నానని అన్నారు ప్రశాంత్ వర్మ.
ఇదే ఈవెంట్ లో వైవీఎస్ చౌదరి కూడా అటెండ్ పాల్గొన్నారు. తేజ్ ని పరిచయం చేసే ఛాన్స్ నాకు వచ్చింది. ఆ టైం లో ఎందుకు నటుడు అవ్వాలని అనుకుంటున్నావ్ అని అడిగితే.. డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని ఉంది కానీ ఒక జీవితంలో ఇవ్వన్నీ అవ్వలేం కాబట్టి హీరో అయితే ఇవన్నీ చేయొచ్చని అన్నాడు. ఆ ఆన్సర్ చాలా బాగా నచ్చిందని అన్నారు వైవీఎస్ చౌదరి. రౌడీ అల్లుడిలో చిరంజీవి గారికి రెండు షేడ్స్ ఎలా ఉంటాయో.. తేజ్ లో కూడా వినయం చిలిపితనం రెండూ ఉంటాయని అన్నారు.
ఈ ఈవెంట్ లో పాల్గొన్న మరో దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ.. చిత్రలహరి రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి బొకె వచ్చింది. తేజ్ హీరో కాకముందు నుంచి ఫ్రెండ్. ఈ పదేళ్ల జర్నీలో ఎంతో హార్డ్ వర్క్ చేశాడు.. ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించాడు.. ఇలానే అతను విజయాలు అందుకోవాలని బెస్ట్ విషెస్ అందించారు కిశోర్ తిరుమల.
ఆ తర్వాత తేజ్ తో రిపబ్లిక్ సినిమా తీసిన దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ.. మెగా పవర్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్, సుప్రీం ఇలా తేజ్ ఎనర్జీ చూసి అతనికి రెండు కథలు చెప్పా.. అందులో ఒకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ. మరో కథ వేరే జోనర్. ఐతే స్పోర్ట్స్ జోనర్ ఆల్రెడీ చేస్తున్నా.. మరో కథ తనకు సరిపోదని అన్నాడు. ఐతే జిం లో రిపబ్లిక్ సినిమా ఐడియా స్టేజ్ లో ఉంటే అది చెబితే ఈ కథ చేద్దామని అన్నాడు. కానీ ఈ సినిమా క్లైమాక్స్ నీకు నచ్చదు అంటే.. ఏముంది సార్ హీరో చనిపోతాడు అంతే కదా అన్నాడు. సినిమా రిలీజ్ టైం లో ఎడిటింగ్ టేబుల్ మీద కూడా మారుద్దామని అనుకున్నా కానీ ఆ క్లైమాక్స్ కాకుండా రిలీజ్ చేస్తే అది నా సినిమా కాదని అన్నాడని గుర్తు చేశారు దేవా కట్టా. ఇప్పటివరకు తేజూ పొటెన్షియల్ మీరు చూసింది చాలా తక్కువ అని అన్నారు దేవా కట్టా.