50 థియేటర్ల కోసం 1200 థియేటర్లు వదులుకోలేం!
ఇంకా మాట్లాడుతూ..'మా సినిమాపై హిందీ బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ 1200 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ తెలుగులో మాకు కేవలం 50 థియేటర్లే దొరుకుతు న్నాయి.
యంగ్ హీరో తేజ సజ్జా సంక్రాంతి వార్ కి సిద్దమైన సంగతి తెలిసిందే. అతడు కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం 'హనుమాన్' మంచి అంచనాలతో రిలీజ్ అవుతుంది. ప్రచార చిత్రాలతోనే సినిమాకి పాజిటివ్ బజ్ మొదలైంది. దీంతో మేకర్స్ కూడా ఎంత పోటీ ఉన్నా! తగ్గేది లేదం టూ పోటీ బరిలో దిగుతున్నారు. పోటీగా మరో నాలుగు సినిమాలున్నా! కంటెంట్ తో కొట్టబోతున్నాం అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని చిత్ర నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తమ సినిమాకి హిట్ అనే టాక్ థియేటర్ల సంఖ్యని పెంచుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా గురించి మరిన్ని ఆసక్తిర విషయాలు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పంచుకున్నారు. తేజతో ఈ సినిమా ఐడియా ఎలా వచ్చింది? అతడి విజన్ ఏంటి? ఏం చూపించబోతున్నాడు? వంటి విషయాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయన మాటల్లోనే...
'జాంబీ రెడ్డి విజయం తో సూపర్‌హీరో సినిమా తీయగలను అనే నమ్మకం ఏర్పడింది. ఆ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. అప్పుడే సూపర్ హీరో సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఐడియా తట్టింది. నా జీవితంలో జరిగిన మంచి విషయాలు కొన్నింటిని నిర్మాత నిరంజన్ రెడ్డి కి చెప్పాను. అందులో నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అలా కథ సిద్దం చేసాను. కానీ బడ్జెట్ గురించి కొన్నిసార్లు ఆందోళన కలిగేది. భారీ బడ్జెట్ తో చేస్తున్నామనే టెన్షన్ ఉండేది. కానీ అతను దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
చాలా నమ్మకంతో సినిమాను విదేశీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించు కున్నాం. అదృష్టవశాత్తూ టీజర్ విడుదలైన తర్వాత విదేశాలలో డిస్ట్రిబ్యూటర్ల నుండి ఆఫర్లు వచ్చాయి. మన ఇతిహాసాల గురించి ప్రపంచమంతా ఇప్పుడు తెలుసుకుంటుంది. అది మా సినిమాకి ఎంతో ప్లస్ అవుతుంది. తేజ తన పాత్రని చాలా బాగా చేసాడు. ఆ పాత్రకి తను మాత్రమే సూట్ అవుతాడని రిలీజ్ తర్వాత ప్రేక్షకులు అంటారు' అని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ..'మా సినిమాపై హిందీ బయ్యర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. అక్కడ 1200 థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ తెలుగులో మాకు కేవలం 50 థియేటర్లే దొరుకుతు న్నాయి. 50 థియేటర్ల కోసం 1200 థియేటర్లని వదులుకోలేం కదా' అన్నారు. ఇంకా తదుపరి ప్రాజెక్ట్ లు గురించి రివీల్ చేసారు. 'నాకు అనేక ప్రణాళికలు ఉన్నాయి. హను-మాన్ విడుదల తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటా. హనుమాన్ కి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఒక సూపర్ ఉమెన్ స్టోరీ కూడా ఉంది. దానికి మంచి నిర్మాత కావాలి' అని అన్నారు.