సలార్ విషయంలో భయపడుతున్న ప్రశాంత్ నీల్..!

ప్రభాస్ సలార్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ అదరగొట్టేస్తున్నాయి

Update: 2023-12-20 16:53 GMT

ప్రభాస్ సలార్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ అదరగొట్టేస్తున్నాయి. యూఎస్ లో కూడా సినిమా ఇప్పటికే 2 మిలియన్ ప్రీమియర్స్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రభాస్ స్టామినా చూపించేలా సలార్ వసూళ్లు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ పై విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు.

ప్రభాస్ సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒక విషయంలో కాస్త భయపడుతున్నారని తెలుస్తుంది. అదేంటి అలా ఎందుకు అనుకోవచ్చు.. తను ఇంతకు ముందు చేసిన 3 సినిమాలు ఉగ్రం, కె.జి.ఎఫ్ మొదటి భాగం, కె.జి.ఎఫ్ 2 తనకు అంతగా నచ్చలేదని. వాటి ఫైనల్ అవుట్ పుట్ చూడకుండానే సినిమా రిలీజ్ చేశానని అన్నారు ప్రశాంత్ నీల్. కానీ సలార్ తనకు చాలా నచ్చిందని దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని ప్రశాంత్ నీల్ కంగారు పడుతున్నారు.

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రశాంత్ నీల్ కథను ఎక్కడ లేపాలి.. ఎక్కడ ఎమోషన్ పండించాలి.. ఎక్కడ హీరోని ఎలివేట్ చేయాలి ఇవన్ని బాగా తెలుసు సో ఇవన్నీ సలార్ లో బాగానే వర్క్ అవుట్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. సో అవి నచ్చలేదు కానీ అయినా హిట్ అయ్యాయి. కానీ సలార్ నచ్చింది కాబట్టి ప్రశాంత్ నీల్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడుతున్నట్టే అని చెప్పొచ్చు.

ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ నీల్ తను సోషల్ మీడియాకు దూరమైన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఫ్యాన్స్ అంతా సినిమా అప్డేట్స్ గురించి అడుగుతారు. కె.జి.ఎఫ్ 2 తర్వాత టైం లో తనకు వచ్చిన 1000 ట్వీట్స్ కన్నా నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ చేశానని అన్నారు ప్రశాంత్ నీల్.

ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యాం, ఆదిపురుష్ లు సరిగా ఆడలేదు ఆ ఇంప్యాక్ట్ సలార్ మీద ఉంటుందా అని ప్రశాంత్ నీల్ ని అడిగితే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఒకటి రెండు సినిమాలు కాదు 20 ఫ్లాప్స్ వచ్చినా క్రేజ్ తగ్గదు. సో ముందు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సలార్ మీద ఆ ఎఫెక్ట్ చూపించవని అన్నారు ప్రశాంత్ నీల్.

Tags:    

Similar News