మహేష్.. అంత రిస్క్ చేస్తాడా?
ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో పాన్ ఇండియాలెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు
ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో పాన్ ఇండియాలెవల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. సంక్రాంతి రేసులో వచ్చి ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న మొదటి చిత్రంగా హనుమాన్ నిలిచింది. ఈ సినిమా తీసుకొచ్చిన హైప్ తో వెంటనే సీక్వెల్ ని పట్టాలు ఎక్కించే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నాడు. జై హనుమాన్ స్క్రిప్ట్ కూడా ఇప్పటికే ఫైనల్ అయ్యింది.
జై హనుమాన్ సినిమాపై ప్రస్తుతం ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది. జై హనుమాన్ మూవీని భారీ బడ్జెట్ తో గ్లోబల్ లెవల్ హై స్టాండర్డ్ లో తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇందులో టైటిల్ రోల్ హనుమాన్ పాత్ర కోసం చాలా మంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. రానా పేరు ప్రముఖంగా వినిపించింది.
అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి అయితే బాగుంటుందని ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి కథని నేరేట్ చేస్తానని కూడా చెప్పారు. ఆయన ఒప్పుకుంటే మూవీ మరో రేంజ్ లో ఉంటుందని అన్నారు. అలాగే సినిమాలో రాముడి పాత్ర కూడా కీలకంగా ఉంటుందని, ఆ పాత్రకి మహేష్ బాబు అయితే ఎలా ఉంటుందా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. మహేష్ బాబుని శ్రీరాముడి లుక్ లో స్కెచ్ వేసి చూస్తున్నామని కూడా అన్నారు.
అయితే సినిమాలో శ్రీరాముడి పాత్ర ఉండేది ఒక 15 నిమిషాలు మాత్రమే దానికోసం సూపర్ స్టార్ ఒప్పుకుంటాడా అనేది డౌట్. ఇప్పటికే ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించాడు. అయితే మేకోవర్ సరిగా లేకపోవడంతో ఆ పాత్రకి ప్రభాస్ సెట్ కాలేదనే విమర్శలు వచ్చాయి. అలాగే రకరకాల మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.
అందుకే రాముడి పాత్ర అంటే ఏ హీరో అయిన ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేస్తారు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరియర్ లో శ్రీ రాముడి పాత్రని ఎప్పుడు ట్రై చేయలేదు. మహేష్ బాబు కూడా అలంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడు. అయితే ప్రశాంత్ వర్మ మేకింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే విధంగా ఉంటాయి. దానిని దృష్టిలో ఉంచుకొని మహేష్ ఏమైనా ఒప్పుకుంటాడా అనేది చూడాలి. ఒక వేళ అంగీకరిస్తే మాత్రం చిరంజీవి, మహేష్ కాంబినేషన్ కారణంగా జై హనుమాన్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.