ప్రేమలు 2కి హైదరాబాద్ టచ్..?
ఈ సినిమాకు హైదరాబాద్ తో టచ్ ఉండటం వల్ల సినిమా మన వాళ్లకు బాగా ఎక్కేసింది. మలయాళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తెలుగు ప్రేక్షకులకు ఒక సినిమా అది ఎలాంటి జోనర్ అయినా సరే నచ్చితే చాలు దాన్ని సూపర్ హిట్ చేసేస్తారు. ఇక ఇతర భాషల నుంచి లవ్ స్టోరీ మన యూత్ ఆడియన్స్ కి నచ్చితే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ హిట్ సాధిస్తుంది. అలాంటి సూపర్ హిట్ సినిమాగా నిలిచిందే ప్రేమలు. మళయాళంలో తెరకెక్కిన ప్రేమలు సినిమాను గిరీష్ ఏడి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నెస్లెన్, మమితా బైజు లీడ్ పెయిర్ గా నటించారు.
ఈ సినిమాకు హైదరాబాద్ తో టచ్ ఉండటం వల్ల సినిమా మన వాళ్లకు బాగా ఎక్కేసింది. మలయాళంలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే సూపర్ హిట్ అయిన సినిమాలకు ఈమధ్య వెంటనే సీక్వెల్ ప్రకటిస్తున్నారు. ఐతే ప్రేమ కథలకు సీక్వెల్ రావడం చాలా అరుదు. ప్రేమలు సినిమా భాషతో సంబంధం లేకుండా యూత్ ఆడియన్స్ కు నచ్చేసింది.
ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో మళ్లీ హైదరాబాద్ టచ్ ఉండేలా చూస్తున్నారట. ప్రేమలు లో హైదరాబాద్ సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. మళయాళంలోనే కాదు తెలుగు ఆడియన్స్ కు రీచ్ అయ్యేందుకు అది బాగా ఉపయోగపడింది. అందుకే ప్రేమలు 2 లో కూడా హైదరాబాద్ ఇంకా తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఇంకా ఇక్కడ రిఫరెన్స్ లు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ప్రేమలు సినిమాతో మమితా బైజు సూపర్ పాపులర్ అయ్యింది. సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఆమె ప్రేమలో పడిపోయారు. ప్రేమలు తర్వాత తమిళ్ లో అయితే మమితాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా మమితా చేయాలని అనుకుంటుంది. ప్రేమలు 2 తో మమితా మరోసారి యూత్ ఆడియన్స్ కు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. మరి ప్రేమలు 1 లానే ప్రేమలు 2 కూడా అదరగొడుతుందా లేదా అన్నది చూడాలి. ప్రేమలు 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఐతే ప్రేమలు 2 మీద అంచనాలు ఉన్నాయి. సో మేకర్స్ ఆ అంచనాలకు తగినట్టుగా సినిమా చేయాల్సి ఉంటుంది. మరి ప్రేమలు 2 సినిమా ఎలా ఉండబోతుంది.. మరోసారి నెస్లెన్, మమితాల లవ్ స్టోరీ ఎలా అలరిస్తుంది అన్నది చూడాలి.