పుష్కర కాలం కెరీర్ లో అతను సాధించింది ఇదేనా..?

సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని చెప్పడం కష్టం. కొందరికి లక్ తోడై మంచి అవకాశాలు వస్తాయి.

Update: 2024-10-21 03:53 GMT

సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని చెప్పడం కష్టం. కొందరికి లక్ తోడై మంచి అవకాశాలు వస్తాయి. మరికొందరికి అన్ లక్కీగా ఆఫర్లు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి పర్వాలేదు అనిపించినా కూడా అన్ లక్కీ వల్ల ఛాన్సులు రావు అలాంటి టైం లో ఏ అవకాశం వచ్చినా చేసేద్దాం అన్నట్టు ఉంటారు. అలాంటి లిస్ట్ లో యువ హీరో, నటుడు ప్రిన్స్ ఉంటాడు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్ సెసిల్.

ఆ తర్వాత మారుతి డైరెక్షన్ లో వచ్చిన బస్ స్టాప్ లో కూడా నటించి మెప్పించాడు. ఆ తర్వాత వరుసగా సోలోగా మూడు నాలుగు సినిమాలు చేసినా వర్క్ అవుట్ కాలేదు అందుకే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. అలా తను ఎప్పుడైతే సైడ్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడో అతని కెరీర్ హీరోగా ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. కొన్నాళ్లు వెయిట్ చేసి లీడ్ రోల్స్ చేస్తే బాగుండేది కానీ అసలు కనిపించకుండాపోతే ఆడియన్స్ మర్చిపోతారనే భావనలో ప్రిన్స్ వచ్చిన ప్రతి చిన్న పాత్ర చేస్తూ వచ్చాడు.

ఐతే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో మళ్లీ కాస్త చర్చల్లో నిలిచాడు ప్రిన్స్. ఈమధ్యనే కాళి అంటూ ఒక సినిమాలో దాదాపు లీడ్ రోల్ అన్నట్టుగా చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ప్రిన్స్. ఫలానా అని కాదు వచ్చిన సినిమాను చేస్తూ వచ్చానని అన్నాడు. దాదాపు పుష్కర కాలం అంటే 12 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న ప్రిన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతా అంటే ఏముంది ఒక 40, 50 వేలు ఉండొచ్చని అన్నాడు.

అదేంటి అంటే ఏదైనా చెక్ వస్తే ఇంట్లో వాళ్లకి ఇచ్చి దేనిలోనో ఒక దానిలో ఇన్వెస్ట్ చేయమని అంటానని చెప్పాడు ప్రిన్స్. అంతేకాదు అవసరమైనప్పుడు వారి దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని మళ్లీ వారికి తిరిగి ఇచ్చేస్తానని అన్నాడు. అమౌంట్ విషయంలో ఇంట్లో వాళ్లు చాలా స్ట్రిక్ట్ అన్నట్టుగా ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సోలో హీరోకి రియల్ లైఫ్ హీరోయిన్ దొరకలేదా అంటే లేదని అంటున్నాడు ప్రిన్స్. ప్రస్తుతం సినిమాలు వస్తున్నాయని వాటిని పూర్తి చేయడమే తన లక్ష్యమని అంటున్నాడు ప్రిన్స్.

Tags:    

Similar News