బామ్మర్ధి పెళ్లిలో నిక్‌ జోనాస్ ఏం చేశాడంటే..!

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చింది. బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపించని ఈ అమ్మడు ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చింది

Update: 2025-02-08 07:30 GMT

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియాకు వచ్చింది. బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి చూపించని ఈ అమ్మడు ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చింది. రాజమౌళి - మహేష్ బాబు సినిమా షూటింగ్‌లో దాదాపు వారం రోజుల పాటు పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌ నుంచి ఇటీవలే ముంబై చేరుకుంది. తన సోదరుడు సిద్దార్థ్‌ చోప్రా పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు గాను ప్రియాంక చోప్రా ముంబై వెళ్లింది. యూఎస్‌ నుంచి ఇటీవలే ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్ సైతం వచ్చారు. బామ్మర్ధి పెళ్లిలో నిక్ జోనాస్ చేసిన సందడి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గత రెండు మూడు రోజులుగా ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. హల్దీ మొదలుకుని ప్రతి ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. కజిన్స్‌తో కలిసి ప్రియాంక డాన్స్‌ చేసిన వీడియోలు సైతం అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా బామ్మర్ధి సిద్దార్థ్‌ చోప్రా పెళ్లి వేడుకలో నిక్ జోనస్‌ పాడిన పాటల ప్రత్యేకంగా నిలిచాయట. ప్రపంచ ప్రసిద్ది గాంచిన బ్యాండ్‌ మెంబర్‌ అయిన నిక్‌ జోనస్ పాటల కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి నిక్‌ జోనస్ పెళ్లిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో చాలా స్పెషల్‌గా వేడుక మారిందట.

నిక్‌ జోనస్‌ పాట పాడిన వీడియోను ప్రియాంక చోప్రా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ఆ వీడియోకు మంచి స్పందన దక్కింది. నిక్‌ను వివాహం చేసుకున్న సమయంలో ప్రియాంక చోప్రా గురించి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేవలం డబ్బు కోసం అతడిని వివాహం చేసుకుంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. తనకన్నా పదేళ్లు చిన్నవాడిని చేసుకోవడం వల్ల వీరి వైవాహిక బంధం సవ్యంగా ఉండక పోవచ్చు అని అంతా భావించారు. కానీ వీరి వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది. వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. వీరి పాపతో సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్నారు.

తాజాగా సిద్దార్థ్‌ చోప్రా వివాహంలో వీరిద్దరు చేసిన సందడి చూసి చాలా మంది భార్య భర్త అంటే ఇలా ఉండాలని అభినందించారట. ఇద్దరూ కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా కలిసి ఉండేందుకు ఎక్కువ సమయం లభించకున్నా ఉన్నప్పుడు చాలా సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. ప్రియాంక చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ మూవీలో నటించబోతుంది. అది కూడా మన తెలుగు సినిమా, మహేష్ బాబు సినిమా కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని, కీలక పాత్ర అనే వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న మహేష్ బాబు - రాజమౌళి సినిమా కోసం ప్రియాంక చోప్రా బల్క్‌ డేట్లు ఇచ్చిందని సమాచారం. పెళ్లి తర్వాత మరో రెండు వారాల పాటు ప్రియాంక చోప్రా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News