భూమిని హాలీవుడ్‌కి లాక్కెళుతున్న పీసీ?
ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతోంది. హాలీవుడ్ లోను బిజీ స్టార్ గా కొనసాగుతోంది. ఇప్పుడు భూమి ఫెడ్నేకర్ ని కూడా లిఫ్ట్ చేస్తుందా?
ప్రియాంక చోప్రా గ్లోబల్ సక్సెస్‌ను సాధించిన మేటి ప్రతిభావని. బాలీవుడ్ సహా హాలీవుడ్ లోను స్టార్ గా ఏల్తోంది. మన 'దేశీ గర్ల్'కి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్లోబల్ ఐకాన్‌గా ఎన్నో బృహత్తర సేవలను చేస్తూనే, నటిగాను కెరీర్ ని సాగిస్తోంది. ఇటీవల జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్ క్లాస్‌లో భూమి పెడ్నేకర్- ప్రియాంక స్ఫూర్తిదాయకమైన సంభాషణతో ఆకట్టుకున్నారు. ఆ ఇద్దరూ మొదట ఎలా కలిశారో కూడా గుర్తు చేసుకున్నారు.
భూమి పెడ్నేకర్ .. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా క్లాస్‌మేట్స్. తమ స్కూల్ వార్షికోత్సవం రోజున పీసీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ప్రియాంకను వేదికపై పది నిమిషాల పాటు డ్యాన్స్ చేయమని పిలిచినప్పుడు తను భూమి ఫెడ్నేకర్ వైపు చూసిందిట. ఆ చూపు జీవితాంతం గుర్తుండిపోయింది. భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ, ''ఆమె నా వైపు చూస్తోంది. అంతే. ఆమె నాకు జీవితకాలం అంత స్పష్టమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది'' అని తెలిపింది. మొదటి కలయిక గురించి ప్రియాంక చోప్రా కూడా తనకు గుర్తుకు వచ్చిందని తెలపగా.. భూమి పెడ్నేకర్ కూడా ఆశ్చర్యపోయారు. రోహిణి అయ్యర్ పార్టీలో తాను పీసీని కలిసినట్లు భూమి వెల్లడించింది. అక్కడ తమ మొదటి సమావేశం గురించి తాజా భేటీలో గుర్తు చేసుకున్నారు.
అయితే ఆ ఇద్దరి భేటీ అనంతరం నెటిజనుల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతోంది. హాలీవుడ్ లోను బిజీ స్టార్ గా కొనసాగుతోంది. ఇప్పుడు భూమి ఫెడ్నేకర్ ని కూడా లిఫ్ట్ చేస్తుందా? అంటూ ఒక సెక్షన్ లో డిబేట్ స్టార్టయింది. ఆ ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం చూస్తుంటే తప్పనిసరిగా హాలీవుడ్ కి లాక్కెళుతుందనే పీసీపై నమ్మకం వ్యక్తమవుతోంది. అయితే కొన్నిటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిభావంతురాలైన భూమి ఫెడ్నేకర్ లో పీసీని ఫాలో చేయాలనే ఆలోచన ఉందా లేదా? కూడా తెలియాల్సి ఉంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. భూమి పెడ్నేకర్ అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించిన 'ది లేడీకిల్లర్' చిత్రంలో తదుపరి కనిపిస్తుంది. భక్షక్ - మేరే హస్బెండ్ కి బివి అనే మరో రెండు చిత్రాలలో కూడా నటిస్తోంది. ప్రియాంక చోప్రా తదుపరి 'ప్రాజెక్ట్ హెడ్స్ ఆఫ్ స్టేట్'లో నటిస్తోంది. జాన్ సెనా, ఇద్రిస్ ఎల్బాతో పీసీ స్క్రీన్‌ను షేర్ చేసుకోనుంది.