పులితో పెద్ద సావాస‌మేనండోయ్!

తొలిసారి ఓ పులి పాత్రకు డబ్బింగ్ చెబుతూ పీసీ వార్త‌ల్లో నిలుస్తుంది. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Update: 2024-04-22 06:09 GMT

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిపోయినా! బాలీవుడ్ కి ట‌చ్ లోనే ఉంటుంది. ఇండియాలో ఏం జ‌రుగుతోందో? ప్ర‌తీ విష‌యాన్ని తెలుసుకుంటుంది. అమెరికాలో ఉంటూనే ముంబై అవ‌కాశాలు అందుకుంటోంది. మ‌న‌సుకు న‌చ్చిన పాత్రైతే నో అనకుండా సైన్ చేస్తోంది. తాజాగా అమ్మ‌డు 'టైగ‌ర్' అనే డాక్యుమెంట‌రీ లో అంబా అనే ఆడ‌పులి పాత్ర‌కు డ‌బ్బింగ్ చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా మేక‌ర్స్ అమెని ఏరికోరి మ‌రీ డ‌బ్బింగ్ కి ఒప్పించారు.

ఇలాంటి డ‌బ్బింగ్ ల‌కు పీసీ ఒప్పుకుంటందా? అని చాలా మందికి సందేహం ఉండేది. కానీ టైగ‌ర్ కి డ‌బ్బింగ్ చెప్ప‌డం అమ్మ‌డు ఎంతో ల‌క్కీగా భావిస్తుంది. తాజాగా ఆ విశేషాల్ని పంచుకుంది. ప్ర‌కృతికి సంబంధించిన సినిమాల‌కు నేను పెద్ద అభిమానిని. మ‌న‌దేశం నుంచి వ‌స్తోన్న టైగ‌ర్ అనే నా గొంతుతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఒక న‌టిగా ఆడియో విజువ‌ల్స్ మాధ్య‌మానికి అల‌వాటు ప‌డ్డాను. కానీ ఇప్పుడు కేవ‌లం నా వాయిస్ తోనే బావోద్వేగాలు పండించాలి. తొలిసారి ఓ స‌రికొత్త పాత్ర‌లో కొత్త అనుభూతి పొందుతున్నాను.

ఇది నిజంగా స‌వాల్ తో కూడిన ప‌నే. ఆ కోరిక 'టైగ‌ర్' తో నెర‌వేరుతుంది. ప్ర‌కృతిని అందాల్ని..జీవాల్ని చూస్తూ ఆ పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డం గొప్ప అన‌భూతినిస్తుంది. ఇలాంటివి చేస్తున్న‌ప్ప‌డు మ‌న‌మేంటి? అన్న‌ది మ‌ర్చిపోయి పూర్తిగా ఆ లోకంలోకి వెళ్లిపోతాం' అని అంది. మ‌రి ఈ పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్ప‌డానికి అమ్మ‌డు ఎంత‌గా స‌న్న‌ధ‌మైంది? అన్న‌ది తెలియాలి. ఇంత‌వ‌ర‌కూ అమ్మ‌డు త‌న పాత్ర‌ల‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంది త‌ప్ప డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏ సినిమాకి ప‌నిచేయ‌లేదు.

తొలిసారి ఓ పులి పాత్రకు డబ్బింగ్ చెబుతూ పీసీ వార్త‌ల్లో నిలుస్తుంది. ఒక పులి ఎనిమిదేళ్ల జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా అమెరికాలో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. నిక్ జోనాస్ తో వివాహం త‌ర్వాత అక్క‌డే స్థిర‌ప‌డింది.

Tags:    

Similar News