నానికి.. పవన్ కి మధ్య తేడాని ఒక్కమాటలో తేల్చినా సరిపోదా శనివారం హీరోయిన్..

తాజాగా ఈ ముద్దుగున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నాచురల్ స్టార్ నాని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-08-20 21:30 GMT

నాని గ్యాంగ్ లీడర్ మూవీ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై అతి కొద్ది కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ సృష్టించుకున్న నటి ప్రియాంక మోహన్. అందం అంతకు మించిన అభినయం ఉండడంతో ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. అంతేకాదు ఆమె సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేసే వేయించికి తన డిమాండ్ పెంచుకుంది. అందుకే మోస్ట్ లక్కీస్ట్ హీరోయిన్ అనే పేరుని తన ఖాతాలో వేసుకుంది.


తాజాగా ఈ ముద్దుగున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నాచురల్ స్టార్ నాని గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెసిడెంట్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ నెల 29న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతున్న నాని సరిపోదా శనివారం చిత్రంలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది.

మూవీ విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఓ మీ ఇంట్లో ప్రియాంక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అటువంటి స్టార్ తో కలిసి నటించే అవకాశం రావడం ఎంతో అదృష్టమని.. పవన్ కళ్యాణ్, నాని ఇద్దరు క్రియేటివ్ గా ఉంటారు అని పొగిడింది. ఇక పవన్ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంటారని.. నాని మాత్రం సినిమాల గురించి కలలు కంటూ ఉంటాడని చెప్పకు వచ్చింది. ఇక ఓజి లాంటి సినిమాలో భాగస్వామ్యం కావడం తనకి ఎంతో లక్కీ అని అంది.

తనకి ఇటువంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన

నిర్మాత, దర్శకుడికి ధన్యవాదాలు తెలిపింది. ఇక నాని కూడా పవన్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఒకరకంగా తీసుకుంటే ప్రజలలోకి వెళ్లడానికే పవన్ సినిమాల్లోకి వచ్చారేమో అనిపిస్తుంది అని అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి హీరో హీరోయిన్లు ఇద్దరూ పవన్ విరాభిమానులు అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక నాని సరిపోదా శనివారం చిత్రంతో తన మార్కెట్ వాల్యూ ని పెంచుకోవడంతో పాటు తనకంటూ ఓ స్ట్రాంగ్ హోల్డ్ తెచ్చుకోవడానికి ముందుకి రాబోతున్నారు.

Tags:    

Similar News