రీరిలీజ్​ ట్రెండ్​.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్స్​ బిగ్ షాక్​

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్​ ట్రెండ్​ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Update: 2023-08-20 07:51 GMT

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్​ ట్రెండ్​ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్‌ హిట్​గా నిలిచిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. 'రీళ్లు'లో సందడి చేసిన చిత్రాను 4కే టెక్నాలజీతో కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఏదైనా సూపర్ హిట్​ సినిమాను టీవీలోనో, ఓటీటీలోనో చూసి.. అరే ఈ చిత్రం చాలా బాగుందే థియేటర్లలో చూసి ఉంటే బాగుండేది అనుకునేవారికోసం వీటిని మళ్లీ విడుదల చేస్తున్నారు.

ఆయా హీరోల పుట్టినరోజు లేదా ఇతర సందర్భాల సమయంలో అభిమానులు ఈ చిత్రాలను రిలీజ్​లు చేస్తున్నారు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడి దాకా అంతా బాగుంది కానీ ఇప్పుడీ రీరిలీజ్​లు ఇండస్ట్రీలో ఓ పెద్ద సమస్యగా మారబోతున్నాయి. వీటి వల్ల లాభాలు ఎలా అయితే ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

ఇప్పటికే పలువురు నిర్మాతలు ఈ రీరిలీజ్​ల వల్ల నష్టపోతున్నాం అంటూ వాపోతున్నారు. తమ చిన్న చిత్రాలను విడుదల చేసే వీకెండ్​లో వాటిని విడుదల చేయడం వల్ల.. ప్రేక్షకులు ఎక్కువగా వాటికే ఆసక్తి చూపిస్తున్నారని తద్వారా తమకు వసూళ్లు రావట్లేదని, నష్టపోతున్నామని చెబుతున్నారు. అయితే ఇది జరుగుతున్న సమయంలో రీరిలీజ్​ సినిమా నిర్మాతలు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. డిమాండ్​ను క్యాష్​గా మార్చేందుకు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తున్నారట.

పాట సినిమాల రీరిలీజ్​ రైట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లకు బిగ్ షాక్​ ఇస్తున్నారట. భారీ ధరలు చెబుతున్నారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాస్​ ఎంబీబీఎస్​ సినిమాకు... జెమినీ ఫిల్మ్​ సర్యూట్​ వారు రూ.2కోట్లు డిమాండ్ చేశారుట. నాగచైతన్య-సమంత 'ఏమాయ చేశావే' ప్రొడ్యూసర్స్​ అయితే రూ.1కోటి చెప్పారట. అంటే ఈ లెక్కన ఏమాయ చేశావే సినిమాకు ఎక్స్​పెన్సెస్​ రీకవర్ అవ్వాలంటే కనీసం రూ.3.5కోట్లు వసూళ్లు అవ్వాలి.

టైర్​ -1 స్టార్ హీరోల సినిమాలకైతే ఈ రేట్లు మరింత ఎక్కువ చెబుతున్నారట. డిస్ట్రిబ్యూటర్లు ఇంత రేట్లు చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్యను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి సరి చేసుకోవడం మంచిదని బయట నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ సమస్య ఎక్కడ వరకు వెళ్తుందో..

Tags:    

Similar News