పుష్ప 2… ఇప్పుడు టాప్ 2లో

ఇప్పటి వరకు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఉన్న 'బాహుబలి 2' వసూళ్లని 'పుష్ప 2' బ్రేక్ చేసి టాప్ 2 లోకి వచ్చింది.

Update: 2025-01-06 13:51 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అందరి అంచనాలని దాటిపోయి ఈ చిత్రం రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించింది. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై 640 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఇండియాలోనే అత్యధిక బిజినెస్ ఈ సినిమాకే జరగడంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫైనల్ గా మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.

 

దీంతో ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక సినిమాకి మొదటి రోజే ఏకంగా 275 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 'బాహుబలి 2' మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ ని ఈ సినిమా బ్రేక్ చేసి సరికొత్త సంచలనం క్రియేట్ చేసింది. కలెక్షన్స్ పరంగా నాన్ స్టాప్ జోరు చూపించి మొదటి 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

తరువాత కూడా మూవీ కలెక్షన్స్ నిలకడగా కొనసాగాయి. దీంతో లాంగ్ రన్ లో ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 1831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పటి వరకు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఉన్న 'బాహుబలి 2' వసూళ్లని 'పుష్ప 2' బ్రేక్ చేసి టాప్ 2 లోకి వచ్చింది. దీనికంటే ముందు 2000 కోట్ల కలెక్షన్స్ తో 'దంగల్' టాప్ 1లో ఉంది

అయితే డొమెస్టిక్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే 'పుష్ప 2'నే హైయెస్ట్ గ్రాస్ మూవీగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా హిందీ భాషలో 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటే. అందులో 800 కోట్లకి పైగా వసూళ్లు నార్త్ ఇండియాలోనే వచ్చాయి. ఇప్పట్లో 'పుష్ప 2' రికార్డ్ ని వేరేవారు బ్రేక్ చేయకపోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది.

దంగల్ - 2,024 కోట్లు

పుష్ప 2 - 1831 కోట్లు ***

బాహుబలి 2- 1810 కోట్లు

ఆర్ఆర్ఆర్ మూవీ - 1387 కోట్లు

కేజీఎఫ్ చాప్టర్ 2 - 1250 కోట్లు

జవాన్ మూవీ - 1159 కోట్లు

కల్కి 2898ఏడీ - 1150 కోట్లు

పఠాన్ - 1050 కోట్లు

యానిమల్ - 913.82 కోట్లు

బజరంగీ భాయ్ జాన్ - 918.18 కోట్లు

Tags:    

Similar News