పుష్ప 2… ప్రాఫిట్ లో బాహుబలికి దగ్గరగా..
ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఎన్నో రికార్డులని తిరగరాసిన ‘పుష్ప 2’ మూవీ మరో అరుదైన ఫీట్ ని అందుకునే దారిలో ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని కలెక్షన్స్ తో థియేటర్స్ లో రికార్డులు క్రియేట్ చేసిన ‘పుష్ప 2’ మూవీ ఇప్పటికే 1700 కోట్ల మార్క్ ని దాటేసింది. ఈ నెంబర్ లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిందీలో ఈ చిత్రం ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది. లాంగ్ రన్ లో 1750 కోట్ల మార్క్ ని ఈ చిత్రం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఎన్నో రికార్డులని తిరగరాసిన ‘పుష్ప 2’ మూవీ మరో అరుదైన ఫీట్ ని అందుకునే దారిలో ఉంది. ఇది త్వరలోనే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు. వరల్డ్ వైడ్ గా అత్యధిక ప్రాఫిట్ అందుకున్న తెలుగు సినిమాల జాబితాలో ఏకంగా 182 కోట్లతో ఈ మూవీ మూడో స్థానంలో ఉంది.
‘బాహుబలి 2’ మూవీ 352 కోట్ల బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయ్యి ఏకంగా 508 కోట్ల ప్రాఫిట్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. ఇండియాలో అత్యధిక ప్రాఫిట్ సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ మూవీ ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో 186 కోట్ల ప్రాఫిట్ తో ‘బాహుబలి’ ఉంది. దీనికంటే ‘పుష్ప 2’ కేవలం 4 కోట్లు మాత్రమే వెనుకబడి ఉంది.
ప్రస్తుతం ‘పుష్ప 2’ మూవీ రన్ తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో చివరి దశకి వచ్చేసింది. నార్త్ ఇండియాలో మాత్రం పెద్ద కాంపిటేషన్ లేకపోవడంతో ఇప్పటికి డీసెంట్ వసూళ్లు వస్తున్నాయి. అక్కడి వసూళ్ల కారణంగానే ఈ సినిమాకి ఏకంగా 182 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.
మరో 4 కోట్లు అందుకుంటే ‘బాహుబలి’ ప్రాఫిట్ రికార్డ్ ని ఈ మూవీ బ్రేక్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇది పెద్ద కష్టమైన విషయం కూడా కాదనే మాట వినిపిస్తోంది. ‘బాహుబలి’ మూవీ ప్రాఫిట్ రికార్డ్ ని ‘పుష్ప 2’ బ్రేక్ చేయాలంటే మరో వారం రోజుల పాటు నిలకడగా థియేటర్స్ లో కొనసాగాల్సి ఉంటుంది.
అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘పుష్ప 2’లో ఐకాన్ స్టార్ ఐకానిక్ పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే సుకుమార్ క్రియాటివ్ రైటింగ్ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఆడియన్స్ ఈ చిత్రానికి అఖండ విజయాన్ని అందించారు.