50 కోట్ల మంది ఆడే గేమ్ లోకి పుష్పరాజ్!

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది.

Update: 2024-11-11 05:14 GMT

ఇండియన్ బిగ్గెస్ట్ మూవీగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. దేశంలోనే అత్యధిక బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా టాలీవుడ్ లో మరో 1000 కోట్ల కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏడు ప్రధాన పట్టణాలలో ఏడు మెగా ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ ఈవెంట్స్ తో సినిమాకి మరింత హైప్ రావడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీకి వరల్డ్ వైడ్ గా క్రేజ్ తీసుకొచ్చే దిశగా మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా ప్రపంచంలోనే 50 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ప్రముఖ మొబైల్ గేమ్ ఫ్రీ ఫైర్ తో ‘పుష్ప 2’ టీమ్ ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ధ్రువీకరించారు.

అతి పెద్ద గేమ్, అతి పెద్ద సినిమా కలిసి జట్టు కడుతున్నాయి అని తెలిపారు. దీనిపై ఓ చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. త్వరలో ఫ్రీ ఫైర్ అప్డేటెడ్ వెర్షన్ గేమ్ లోకి ‘పుష్ప 2’ వస్తుందని తెలుస్తోంది. ఫ్రీఫైర్ గేమ్ ఇండియాలో చాలా మంది ఆడుతారు. ఈ గేమ్ ద్వారా ‘పుష్ప 2’ ని అందరికి చేరువ చేసే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో ఇదొక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు.

ఇది వర్క్ అవుట్ అయితే భవిష్యత్తులో చాలా మంది మొబైల్ గేమ్స్ ద్వారా సినిమాలని పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ మూవీ ఐటెం సాంగ్ షూట్ ప్రస్తుతం జరుగుతోంది. శ్రీలీల ఈ ఐటెం సాంగ్ లో డాన్స్ చేస్తోంది. ఇప్పటికే ఆమె పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

ఈ నెల ఆఖరు వరకు మూవీ షూటింగ్ ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. సుకుమార్ ‘పుష్ప 2’ ప్రమోషన్స్ కి దూరంగా ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఆయన పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైన దృష్టిపెట్టనున్నాడని టాక్. అల్లు అర్జున్ ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొని సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారంట. అలాగే రష్మిక కూడా ప్రమోషన్స్ లో పాల్గొననుంది.

Tags:    

Similar News