పుష్ప 2… అక్కడ అన్ని రికార్డులు అవుట్

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి కలెక్షన్స్ కొంత తగ్గిన కూడా హిందీలో రోజు రోజుకి పెరుగుతూ వెళ్తున్నాయి.

Update: 2024-12-08 05:05 GMT

'పుష్ప 2' సినిమాకి క్రిటిక్స్ నుంచి మిశ్రమ రివ్యూలు వచ్చిన కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. సినిమాలోని అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా సెకెండాఫ్ లో వచ్చే సీక్వెన్స్ కి అయితే విజిల్స్ పడుతున్నాయని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి కలెక్షన్స్ కొంత తగ్గిన కూడా హిందీలో రోజు రోజుకి పెరుగుతూ వెళ్తున్నాయి. మొదటి రోజు 'పుష్ప 2'కి హిందీ బెల్ట్ లో 72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

మూడో రోజు ఏకంగా 75 కోట్లు వసూళ్లు అయినట్లు టాక్ వినిపిస్తోంది. శని, ఆదివారాలలో హిందీ బెల్ట్ లో రోజుకి 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంతగా నార్త్ ఇండియాలో సినిమాని ఆదరిస్తున్నారు. రాజమౌళి ప్రమేయం కాకుండా నార్త్ ఇండియాలో ఈ స్థాయిలో ప్రేక్షకనీరాజనాలు అందుకుంటున్న హీరోగా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలబడ్డాడు.

ఇప్పటి వరకు తెలుగు నుంచి హిందీలో డబ్బింగ్ అయ్యి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న సినిమాలు అంటే 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' అని చెప్పాలి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన 'దేవర' మూవీ హిందీ బెల్ట్ లో మంచి వసూళ్లు సొంతం చేసుకున్న భారీగా ప్రభావం చూపలేదు. ఇక ప్రభాస్ కూడా 'బాహుబలి 2' తర్వాత హిందీ ఆడియన్స్ కి చేరువ కావడానికి 'కల్కి 2898 ఏడీ' వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.

అయితే రాజమౌళి ప్రమేయం లేకుండా 'పుష్ప' సినిమాతోనే అల్లు అర్జున్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2' మూవీ అయితే అక్కడ అన్ని రికార్డులని బ్రేక్ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో ఒరిజినల్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని 'పుష్ప 2' బ్రేక్ చేసింది. నెక్స్ట్ దారిలో 'కల్కి 2898ఏడీ', 'ఆర్ఆర్ఆర్' టోటల్ కలెక్షన్స్ రికార్డ్స్ ఉన్నాయి. 'పుష్ప 2' మూవీ నాలుగో రోజుకి 'కల్కి', ఐదో రోజుకి 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ రికార్డ్స్ ని నార్త్ ఇండియాలో బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు.

అలాగే ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా 'కల్కి 2898ఏడీ' మూవీ నిలిచింది. రెండో స్థానంలో 'స్త్రీ 2' ఉంది. వీటిని కూడా పుష్ప 2 బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాజమౌళి హస్తం లేకుండా నార్త్ ఇండియాలో జెండా పాతిన హీరోలుగా రాకింగ్ స్టార్ యష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఇప్పుడు బన్నీ క్రేజ్ బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని దాటేసిందని బిటౌన్ లో మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News