'కిస్సిక్' సింగర్ సుభ్లాషిణి.. ఇక తిరుగులేదా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 నుంచి రీసెంట్ గా కిస్సిక్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 నుంచి రీసెంట్ గా కిస్సిక్ సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల ఆడిపాడిన ఆ పాట హమ్మింగ్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతోంది. అయితే పుష్పలోని ఊ అంటావా సాంగ్ కు రెస్పాన్స్ వచ్చినట్లు.. కిస్సిక్ పాటకు వెంటనే రాలేదు.
కానీ కిస్సిక్ సాంగ్.. ఇప్పుడు మెల్లగా అందరికీ ఎక్కినట్లు కనిపిస్తుంది. 24 గంటల్లో 42 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకుంది లిరికల్ వీడియో. ఇప్పటి వరకు దళపతి విజయ్ విజిల్ పోడు సాంగ్ పేరిట ఆ రికార్డ్ ఉండేది. ఆ పాట 40 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించగా.. కిస్సిక్ సాంగ్ ఏకంగా 42 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన కిస్సిక్ సాంగ్ ను సుభ్లాషిణి ఆలపించిన విషయం తెలిసిందే. ఆమె హస్కీ వాయిస్.. సాంగ్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సాంగ్ కు మెయిన్ అసెట్ గా మారింది. సింగర్ విషయంలో దేవిశ్రీ ఛాయిస్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ అయింది. యంగ్ టాలెంట్ ను ఆయన ఎంచుకున్న తీరు.. ఫ్రెష్ నెస్ ను తెచ్చిపెట్టింది.
జోనితా గాంధీ లేదా శిల్పా రావ్ వంటి ఇప్పటికే పాపులర్ అయిన సింగర్స్ ను కాకుండా దేవిశ్రీ ప్రసాద్ సుభ్లాషిణిని ఎంచుకోగా.. ప్రస్తుతం ఆయనను ప్రశంసిస్తున్నారు. స్పెషల్ సాంగ్ కోసం సరైన గొంతును ఎంచుకున్నారని చెబుతున్నారు. కేవలం 24 సంవత్సరాల వయసులో తన టాలెంట్ తో సుభ్లాషిణి తెగ మెప్పిస్తున్నారని అంటున్నారు.
అయితే సుభ్లాషిణి.. మల్టీ టాలెంట్, ఆకట్టుకునే ప్రదర్శనలతో ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ NEEK మూవీ నుంచి ఇటీవల విడుదలైన గోల్డెన్ స్పారో సాంగ్ ను ఆమెనే ఆలపించారు. తన డైనమిక్ వాయిస్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఓ రేంజ్ లో మెప్పించారు.
ఇన్ స్టాగ్రామ్ ద్వారా మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు సుభ్లాషిణి. తన మ్యూజికల్ వీడియోస్ షేర్ చేసి ఫేమ్ సంపాదించుకున్నారు. 2020లో ఓ కంటెస్ట్ లో గెలిచి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియాతో వర్క్ చేసి పాపులర్ అయిపోయారు. ఇప్పుడు కిస్సిక్ సాంగ్ తర్వాత మంచి అవకాశాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో సుభ్లాషిణి ఎలాంటి ఆఫర్స్ దక్కించుకుంటారో వేచి చూడాలి.