కల్కి 2898ఏడీ కంటే పుష్ప 2కే ఎక్కువ!

భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియా సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తోన్న సంగతి తెలిసిందే

Update: 2024-12-01 07:26 GMT

భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియా సినిమాల టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు ఎంత రేట్ పెంచుకుంటామని చెబితే ప్రభుత్వాలు కూడా ఆ ధరలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాలలో ‘కల్కి 2898ఏడీ’, ‘దేవర’, ‘కంగువా’ సినిమాలకి టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చాయి.

అలాగే స్పెషల్ బెన్ ఫిట్ షోలు వేసుకోవడానికి కూడా అనుమతులు ఇస్తున్నాయి. డిస్టిబ్యూటర్స్ భారీ ధరలు పెట్టి ఈ బెన్ ఫిట్ షోల టికెట్లు అమ్ముతున్నారు. ‘పుష్ప 2’ మూవీ బెన్ ఫిట్ షో టికెట్ ధరలు మల్టీ ప్లెక్స్ లలో 1200 వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప 2కి తెలంగాణలో మొదటి రోజు టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్స్ లలో 354 రూపాయిలుగా నిర్ణయించారు. ఇక మల్టీ ప్లెక్స్ లలో అత్యధికంగా 531 రూపాయిలుగా టికెట్ రేట్ డిసైడ్ చేశారు.

గత కొన్నేళ్లుగా వస్తోన్న పాన్ ఇండియా సినిమాలతో పోల్చుకుంటే అత్యధిక టికెట్ ధరలు ఈ సినిమాకే లభించాయి. బడ్జెట్ బట్టి టికెట్ ధరలకి అనుమతులు ఇస్తారనేది వాస్తవం కాదనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి కారణం ‘కల్కి 2898ఏడీ’ సినిమాని 600+ కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఆ సినిమా టికెట్లు సింగిల్ స్క్రీన్స్ లలో 265కి, మల్టీ ప్లెక్స్ లలో 413 రూపాయిలకి అమ్మారు. ‘పుష్ప 2’ సినిమాని 400-500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ‘కల్కి’ సినిమాతో పోల్చుకుంటే ‘పుష్ప 2’ టికెట్ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. నిర్మాతలు కోరిన ధరలని తెలంగాణ ప్రభుత్వం కూడా మంజూరు చేస్తూ జీవో ఇచ్చిందని అనుకుంటున్నారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ ధరలు పెట్టుకొని మొదటి రోజు సినిమా చూడటం కష్టం అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళి ఈ సిస్టం మొదలు పెట్టారు. ఆరంభంలో 50-100 రూపాయిలు అదనంగా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీకి వచ్చేసరికి ఆ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి.

రానున్న రెండేళ్లలో టికెట్ ధరలు 1000 రూపాయిలకి పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ ఇప్పుడు నడుస్తోంది. అయితే ఈ టికెట్ ధరల పెంపు అనేది మొదటి రోజు భారీ కలెక్షన్స్ చూపించుకోవడానికే బాగానే ఉంటుంది. అయితే వీకెండ్ తర్వాత టికెట్ ధరల ప్రభావం సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News