పుష్ప 2… తెలుగు రాష్ట్రాల టార్గెట్ ఎంతంటే?

నెక్స్ట్ ఏపీలో చిత్తూరు జిల్లాలో 'పుష్ప 2' ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Update: 2024-11-29 07:01 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్జ్ ప్రాజెక్ట్ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రతి ప్రమోషన్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ అక్కడి ప్రేక్షకులని తన మాటలతో ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ ఏపీలో చిత్తూరు జిల్లాలో ‘పుష్ప 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. భారీ టార్గెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తున్నారనే మాట వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో అత్యధిక స్క్రీన్స్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ‘పుష్ప’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. అయితే అప్పుడు టికెట్ రేట్లు కూడా ‘పుష్ప’ కలెక్షన్స్ పైన ప్రభావం చూపించాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వనున్నాయి.

ఈ నేపథ్యంలో భారీ టార్గెట్ తోనే తెలుగు రాష్ట్రాలలో ‘పుష్ప 2’ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రైట్స్ ని ఆంధ్రాలో 90, నైజాంలో 100, సీడెడ్ లో 30 కోట్లకి అమ్మినట్లు తెలుస్తోంది. అంటే ఓవరాల్ గా 220 కోట్ల మేరకు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ జరిగింది. ఈ షేర్ ని అందుకోవాలంటే 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం వసూళ్లు చేయాల్సి ఉంటుంది.

తెలుగు రాష్ట్రాలలో 415 కోట్లతో ‘ఆర్ఆర్ఆర్’ హైయెస్ట్ గ్రాస్ చిత్రంగా టాప్ 1లో ఉంది. ‘బాహుబలి 2’ మూవీ 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెకండ్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. అంటే ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ‘ఆర్ఆర్ఆర్’ ని మించి కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. ఎంత టికెట్ ధరలు పెంచిన కూడా ఒకటి, రెండు వారాలలో 450 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం అసాధ్యం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ స్థాయిలో వసూళ్లని అందుకోవాలంటే మాత్రం లాంగ్ రన్ లో నిలకడగా మంచి వసూళ్లని అందుకోవాల్సి ఉంటుంది. అలాగే సంక్రాంతి సీజన్ లో కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తే తెలుగు రాష్ట్రాలలో ‘పుష్ప 2’ బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశం ఉంటుంది. ‘పుష్ప’ సినిమాతో వచ్చిన నష్టాలని మేకర్స్ ఇంకా బయ్యర్లకి ఇవ్వాల్సి ఉందంట. ఈ మూవీతో లాభాలు వస్తే నష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో మైత్రీ వారికి ఇబ్బంది తప్పదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News