రిలీజ్ కి ముందు పుష్ప‌-2 రికార్డులు!

ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `పుష్ప‌-దిరైజ్` బాలీవుడ్ లో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే

Update: 2024-04-18 10:21 GMT

ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన `పుష్ప‌-దిరైజ్` బాలీవుడ్ లో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. సినిమా మొత్తం వ‌సూళ్ల‌లో స‌గ భాగం నార్త్ మార్కెట్ నుంచే రాబ‌ట్టింది. పైగా పెద్ద‌గా ప్ర‌చారం చేయ‌కుండానే కేవ‌లం తొలి షో అనంత‌రం పాజిటివ్ మౌత్ టాక్ రావ‌డంతోనే అది సాధ్య‌మైంది. అందుకే సినిమా తెలుగులో కంటే హిందీలోనే పెద్ద స‌క్సెస్ గా చెప్పుకుంటున్నారంతా. మ‌రి నిజంగా రిలీజ్ కి ముందు భారీ ఎత్తున ప‌బ్లిసీటి చేసి ఉంటే ఓపెనింగ్స్ రూపంలో ఊహించ‌ని వ‌సూళ్లు వ‌చ్చేవ‌ని ...పైన‌ల్ క‌లెక్ష‌న్ల‌తో ఆనెంబ‌ర్ ఇంకా పెరిగేది అన్న‌ది వాస్తవం.

దీంతో `పుష్ప‌-2` మెయిన్ టార్గెట్ గా హిందీ మార్కెటే క‌నిపిస్తుంది అన్న‌ది వాస్త‌వం. ఇక్క‌డ ఆడియ‌న్స్ కంటే అక్క‌డి నుంచి ఎక్కువ ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. స‌రిగ్గా ఈ పాయింట్ ప‌ట్టుకునే మేక‌ర్స్ నార్త్ లో తెలివిగా బిజినెస్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ హిందీ రైట్స్ ని అనిల్ తదాని 200 కోట్లకు అడ్వాన్స్ బేసిస్ మీద తీసుకున్నార‌నే వార్త వెలుగులోకి వ‌చ్చింది. కానీ ఈ ప్ర‌చారాన్ని కూడా తేలిగ్గా కొట్టిపారే యడానికి లేదు. తెలుగు మార్కెట్ కంటే ముందే 1000 కోట్లు..2000 కోట్లు వ‌సూళ్లు చేసినవి కేవ‌లం హిందీ సినిమాలు అన్న సంగ‌తి గుర్తించుకోవాలి.

హిందీలో స్టార్ హీరో సినిమా అంటే మినిమం 200 కోట్లు ఉంటాయి. సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంటే? 500 కోట్లు పైన ఉంటుంది. ఆ లెక్క‌న చూస్తే బ‌న్నీ`పుష్ప` మొద‌టి భాగం అత‌డు ఎవ‌రో స‌రిగ్గా తెలియ‌కుండానే 100 కోట్ల‌కు పైగా అక్క‌డ నుంచి రాబ‌ట్టింది. దీంతో పుష్ప‌-2పై నార్త్ మార్కెట్ నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఇక్క‌డ ఆడియ‌న్స్ కంటే అక్క‌డ ఆడియ‌న్స్ లో ఎక్కువ ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది. ఆ న‌మ్మ‌కంతోనే అనీల్ త‌డాని ధైర్యంగా 200 కోట్ల‌కు కండీష‌న్ల ప్ర‌కారం రైట్స్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

హిట్ అయితే అదే సినిమా అక్క‌డ మార్కెట్ నుంచి ఈజీగా 400 కోట్ల‌కు పైగానే రాబ‌డుతుంది. ప్ర‌స్తుతం ఈ వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ సినిమా హిందీ రైట్స్ అన్ని కోట్ల‌కు కొన్నారా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ అయింది. ఇంకా ట్రైల‌ర్ రిలీజ్ కావాలి. నార్త్ లో బోడెడంత ప్ర‌చారం చేయాలి. ఇదంతా జ‌రిగిన త‌ర్వాత అంచాన‌లు ఇంకా రెట్టింపు అవుతాయి.

Tags:    

Similar News