ఈ ఏడాది పుష్ప గాడి రూల్ గ్యారెంటీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఆగష్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. పుష్ప మూవీ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న వస్తోన్న పుష్ప ది రూల్ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీపై తెలుగునాట నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు.
పార్ట్ 1 కూడా నార్త్ ఇండియాలోనే భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గట్టి ఇంపాక్ట్ చూపించాలని సుకుమార్ టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. దానికి తగ్గట్లుగానే మూవీ షూటింగ్ పెర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. పుష్ప ది రూల్ మూవీతో వరల్డ్ వైడ్ గా వెయ్యికోట్ల కలెక్షన్స్ ఈ ఏడాది అందుకోవాలని లక్ష్యంతో చిత్ర యూనిట్ ఉంది.
కచ్చితంగా సినిమాపై ఉన్న హైప్ తో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఈజీ అని భావిస్తున్నారు. కచ్చితంగా ఈ ఏడాదిలో పుష్ప మూవీ టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే దాని స్థానం నెంబర్ వన్ లో ఉంటుందా లేదంటే 2లో ఉంటుందా అనేది చెప్పలేం. దీనికి కారణం ఈ ఏడాదిలోనే ఎన్ఠీఆర్ దేవర మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా థియేటర్స్ లోకి రానుంది. ప్రభాస్ కల్కి మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ ఛాన్స్ ఉంది. ఈ మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో కల్కి కచ్చితంగా 2 వేల కోట్లకి పైగా టార్గెట్ ని పెట్టుకుంది. ఈ సినిమాలతో పాటుగా పుష్ప ఈ వెయ్యి కోట్ల రేసులో ఉంది.
వీటిలో గేమ్ చేంజర్ కి వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు. అలాగే దేవర సినిమా దగ్గరకి వచ్చే ఛాన్స్ ఉంది కానీ క్రాస్ చేయకపోవచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. కల్కి మూవీ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు. అయితే మాత్రం పుష్పకి రెండో స్థానం వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఈ ఏడాది నెంబర్ 1 పుష్ప 2నే అవుతుంది.