ఆకులో తింటూ ఆ పగటి కలలేంటి రాశీ?
రాశీ ఖన్నా మంచి ఫుడీ అని తెలుసు కానీ, మరీ ఈ రేంజు ఫుడీనా? సెట్‌లో ఉన్నా, ప్రయాణిస్తున్నా లేదా ఇంట్లో ఉన్నా మంచి భోజనం తప్పనిసరి.;
పగటి కలలు కనాలి కానీ, ఇలా ప్లేట్‌లో ఐటమ్ తినేప్పుడు కూడా కలలు కనడమేంటి? చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది రాశీ! తింటూ తింటూ అరిటాకులోనే నిదురపోతుందా ఏమిటో..! ఇవాళ భోజనంబు.. వింతైన వంటకంబు! అంటూ మాయావి ఘటోత్కచుడు వంటకాలన్నీ గుటకాయ స్వాహా చేసినట్టే, రాశీ కూడా కళ్ల ముందే ఉన్న ఆ వంటకాలన్నిటినీ స్వాహా చేసేయకుండా ఎందుకు ఈ తాత్సారం?
రాశీ ఖన్నా మంచి ఫుడీ అని తెలుసు కానీ, మరీ ఈ రేంజు ఫుడీనా? సెట్‌లో ఉన్నా, ప్రయాణిస్తున్నా లేదా ఇంట్లో ఉన్నా మంచి భోజనం తప్పనిసరి. ఇదిగో ఇలా అరిటాకు నిండుగా వడ్డించుకుని మరీ తింటోంది. అయితే తినే ముందు అలా ఏమరుపాటుగా కునుకుపాటు పడిందా ఏమిటీ...!
రాశి తన తాజా పోస్ట్‌లో తనలోని ఆహార ప్రియత్వం తాలూకా సాహసాల గురించి అభిమానులకు లీకులిచ్చింది. నోరూరించే దక్షిణ భారత రుచికరమైన వంటకాలను ఆస్వాదించడంలోనే కాదు వరల్డ్ వైడ్ ఏ వెరైటీ ఉన్నా తన నాలుకకు అందాల్సిందేనని భావిస్తుంది. ``ఫుడ్ కోమాతో పగటి కలలు కనడం` అనే శీర్షికను ఇచ్చింది దీనికి. మొత్తానికి అరిటాకులో భోంచేసి తెలుగు వారి సంస్కృతిని గుర్తు చేసింది. ప్లాస్టిక్ ప్లేట్ ల యుగంలో అప్రయత్నంగా రాశీ చేసిన ఈ ప్రయత్నం మంచిదే.
సబర్మతి రిపోర్ట్ లో నటించిన తర్వాత తదుపరి ప్రాజెక్ట్ గురించి రాశీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టుల కోసం చర్చలు సాగిస్తోంది. ఇటీవల ఈ బ్యూటీ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యాలయంలో కనిపించడం అభిమానులను ఎగ్జయిట్ చేసింది. తదుపరి తెలుగు ప్రాజెక్ట్ గురించి కూడా రాశీ ప్రకటిస్తుందేమో చూడాలి.