నటి జత్వానీ కేసు విషయంలో రఘురామ సంతృప్తి ఇదేనట!

గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో నటి కాదాంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-17 03:32 GMT

గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో నటి కాదాంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తనను పోలీసులతో కలిసి వేధించారంటూ ఆమె చేసిన ఫిర్యాదు సంచలనంగా మారడం.. దీనిపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం తెలిసిందే. ఈ క్రమంలో రఘురామ స్పందించారు.

అవును... ఏపీ రాజకీయాల్లో నటి కాదాంబరి జత్వానీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈమె వ్యవహారంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేసింది ఏపీ సర్కార్. దీంతో... ఈ వ్యవహారం స్పందించిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు.. ఇది చారిత్రక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.

ఉండి నియోజకవర్గ కేంద్రంలో మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు... జత్వానీ కేసు, తన కేసు ఒకటేనని.. ఈ కేసులో వైసీపీ అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేసిందని, బెయిల్ కూడా రాకుండా ఆమెను దారుణంగా హింసించారని, తనను కూడా అప్పట్లో ఇలాగే హింసించారని తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి డీజీపీ ద్వారకా తిరుమల రావు నివేదిక ఇచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలకు ఉపక్రమించడం, ఇందులో భాగంగా ముగ్గురు ఐపీఎస్ లను ఒకేసారి సస్పెండ్ చేయడం సాహసోపేత నిర్ణయమని తెలిపారు. జత్వానీ అనే సినీనటిని దారుణంగా హింసించడంలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర కీలకం అని అన్నారు.

ఇదే సమయంలో... కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో చెప్పలేని ఎన్నో విషయాలు ఇతరుల ద్వారా తనకు తెలిశాయని రఘురామ అన్నారు. ఇక ప్రధానంగా జత్వానీ ఫిర్యాదు మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల్ని సస్పెండ్ చేయడం సంతృప్తిగా ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఇందులో భాగంగా... తన కేసులో ఉన్న ముగ్గురు అధికారుల్లో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేయడం హర్షనీయమని.. టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు ఎత్తివేయాలని రఘురామ ప్రభుత్వాన్ని కోరారు!

Tags:    

Similar News