పుష్ప మేకర్స్ కి వాళ్లు వార్నింగ్..!

అందుకు తగినట్టుగానే సినిమా వసూళ్లు రాబడుతుంది. బాలీవుడ్ పరిశ్రమలో ఏ సినిమా సృష్టించని రికార్డులను పుష్ప 2 తన ఖాతాలో రాసుకుంటుంది.

Update: 2024-12-09 13:16 GMT

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రీసెంట్ గా రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు, సృష్టిస్తున్న రికార్డులు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఐతే పుష్ప 2 సినిమా విషయంలో ప్రతీది పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేస్తూ వచ్చారు. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమాకు ఉన్న బజ్ చూసి అక్కడ భారీగా ప్రమోట్ చేశారు. అందుకు తగినట్టుగానే సినిమా వసూళ్లు రాబడుతుంది. బాలీవుడ్ పరిశ్రమలో ఏ సినిమా సృష్టించని రికార్డులను పుష్ప 2 తన ఖాతాలో రాసుకుంటుంది.

ఐతే పుష్ప 2 సినిమా రిలీజైన దగ్గర నుంచి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంతోషం కన్నా ప్రీమియర్స్ నాడు ఒక మహిళ థియేటర్ దగ్గర తొక్కిసలాటలో మృతి చెందింది. ఇది చిత్ర యూనిట్ ని తీవ్రంగా బాధించింది. అందుకే ఆ ఫ్యామిలీకి అండగా ఉండేందుకు సిద్ధమని పుష్ప టీం ప్రకటించింది. ఐతే ఇప్పుడు మరో కొత్త సమస్య పుష్ప మేకర్స్ ముందుకొచ్చింది. పుష్ప 2 సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉంది.

అందులో మళయాళ వర్సటైల్ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటించారు. ఐతే ఈ సినిమాలో ఆ పాత్రని నెగిటివ్ గా చూపించారని రాజ్ పుత్ నాయకుడు రాజ్ షెకావత్ ఆరోపించాడు. క్షత్రియులను అవమానించేలా ఆ పాత్ర ఉందని సినిమా నుంచి షెకావత్ అనే పదాన్ని వెంటనే తొలగించాలని లేకపోతే కర్ని సేన పుష్ప నిర్మాతల ఇళ్ల మీద దాడికి సిద్ధమని వార్నింగ్ ఇచ్చారు. ఐతే సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో పాటు పుష్ప రాజ్ వర్సెస్ షెకావత్ మధ్య ఫైట్ వల్ల సినిమాలో షెకావత్ పాత్ర కూడా హైలెట్ అయ్యింది.

ఐతే కర్ని సేన మాత్రం షెకావత్ అనే పదాన్ని తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని.. నిర్మాతల ఇళ్లపై దాడి చేస్తామని చెబుతున్నారు. సినిమాలో షెకావత్ పాత్ర నెగిటివ్ గా చూపించడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వారు అంటున్నారు. ఐతే సౌత్ సినిమాకు అది కూడా ఒక తెలుగు సినిమాకు నార్త్ సైడ్ నుంచి ఇలాంటి వార్నింగ్ రావడం ఇదే మొదటిసారి. మరి దీన్ని నిర్మాతలు సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.

పుష్ప 2 నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో నాలుగు రోజుల్లోనే 829 కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ ఈ కాంబో రేంజ్ ఏంటన్నది మరోసారి ఈ సినిమా ప్రూవ్ చేసింది.

Tags:    

Similar News