గేమ్ ఛేంజర్ రిజల్ట్.. జక్కన్నకి ఏంటి సంబంధం..!

సినిమా ట్రైలర్ లో కొన్ని షాట్స్ గురించి జక్కన్న ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు. ఈ డిస్కషన్ లోనే హార్స్ రైడ్ సీన్ కాపీ రైట్స్ తనవి అంటూ చరణ్ తో కామెడీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2025-01-12 09:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేయగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించారు. రెండు దశాబ్దాల కెరీర్ లో దిల్ రాజు చేసిన హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్. సినిమా రిలీజ్ రోజు మిశ్రమ స్పందన రాగా మెగా ఫ్యాన్స్ కి అక్కడక్కడ కిక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ రిలీజ్ కు రాజమౌళి అటెండ్ అయ్యాడు. శంకర్ మీద ఉన్న అభిమానం తో పాటు తన మగధీరుడు, RRR లో సీతారామరాజు మీద ఉన్న ప్రేమతో రాజమౌళి వచ్చాడు. సినిమా ట్రైలర్ లో కొన్ని షాట్స్ గురించి జక్కన్న ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు. ఈ డిస్కషన్ లోనే హార్స్ రైడ్ సీన్ కాపీ రైట్స్ తనవి అంటూ చరణ్ తో కామెడీ చేసిన విషయం తెలిసిందే. ఐతే గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కొనసాగుతుందని అంటున్నారు.

రాజమౌళితో హిట్ కొట్టిన హీరో ఎవరైనా నెక్స్ట్ ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ పడతాయి. ఈ సెంటిమెంట్ చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. RRR తర్వాత రాం చరణ్ చేసిన ఆచార్య పోయింది. ఐతే అది చిరంజీవి సినిమా అని చెప్పుకుంటే చరణ్ సోలో సినిమాగా వచ్చిన గేమ్ ఛేంజర్ కూడా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఈ విషయం పక్కన పెడితే గేమ్ ఛేంజర్ సినిమాను రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి చూశాడు.

హైదరాబాద్ లో అపర్ణ థియేటర్ లో జక్కన్న ఫ్యామిలీ సినిమా వీక్షించారు. ఐతే సినిమా చూసినా కూడా గేమ్ ఛేంజర్ మీద రాజమౌళి ఎలాంటి ట్వీట్ వేయలేదు. అంటే సినిమా రాజమౌళికి కూడా ఎక్కలేదనే చెప్పుకుంటున్నారు. నిజం చెప్పాలంటే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు రాజమౌళికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కానీ ట్రైలర్ రిలీజ్ కు వెళ్లాడు.. రాజమౌళి సినిమా తర్వాత గేమ్ ఛేంజర్ వచ్చింది లాంటి కారణాలు ఆపాదించి జక్కన్న ఈ సినిమా రిజల్ట్ కి ఒక కారణం అనేస్తున్నారు. సోషల్ మీడియా యుగం కాబట్టి ఇలాంటివి కామన్ అని అంటున్నారు ఆడియన్స్.

Tags:    

Similar News