గేమ్ ఛేంజర్.. మళ్ళీ అలాంటి సినిమా చూస్తారు: రాజమౌళి
దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై మెల్లమెల్లగా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. అనుకున్నట్లుగానే ట్రైలర్ తో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. రాజమౌళి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు ఇక వేడుకలో పాల్గొన్న దర్శక ధీరుడు రాజమౌళి సినిమా గురించి అలాగే డైరెక్టర్ శంకర్ మేకింగ్ విధానం పై గొప్పగా మాట్లాడారు.
రాజమౌళి మాట్లాడే ముందు యాంకర్ సుమ మహేష్ బాబు సినిమా గురించి అడిగారు. ప్రాజెక్ట్ పూజ కార్యక్రమాలతో మొదలైంది కదా ఏదైనా అప్డేట్ ఉందా అని అడగడంతో రాజమౌళి ఆ విషయం గురించి స్పందించలేదు. బయటకు వెళ్లిన తర్వాత మాట్లాడుతానని అన్నారు. ఇక గేమ్ చేజర్ గురించి మాట్లాడుతూ.. ముందుగా డాక్టర్ శంకర్ గారికి ఇది మొదటి తెలుగు స్ట్రెయిట్ సినిమా అని అందరూ చెబుతుంటే అవునా నిజమా అని అనిపించింది.
ఎందుకంటే ఆయనను ఎప్పుడూ కూడా ఒక తమిళ దర్శకుడిగా ఎవరు చూడలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అలాగే మాలాంటి ఎంతోమంది దర్శకులు నిర్మాతలు శంకర్ గారిని తెలుగు డైరెక్టర్ గానే చూశాం. అందరికి ఆయన అంటే ఒక అభిమానం. విపరీతమైన గౌరవం. అందుకే దిల్ రాజు గారు కూడా ఆ గౌరవంతోనే మీతో సినిమా చేశారని నాకు అనిపిస్తుంది. గత పది సంవత్సరాలలో పెద్ద బడ్జెట్ సినిమాలు.. బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, 100 కోట్ల బడ్జెట్ పెట్టి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం.
నేటితరం జనరేషన్ డైరెక్టర్స్ అందరు కూడా మమ్మల్ని చూసి చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మాలాంటి దర్శకులందరికి కూడా శంకర్ గారు ఉంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. ఒరిజినల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ కు ఆయన ఒక ఒరిజినల్ గ్యాంగ్ స్టార్. ఎందుకంటే ఒకప్పుడు మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పుడు చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. పెద్ద పెద్ద కలలను స్క్రీన్ మీద ఆవిష్కరించాడనికి మనం భయపడనక్కర్లేదు. అలా తీస్తే జనాలు చూస్తారు అంత పెద్ద డబ్బు పెట్టినప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన దర్శకుడు శంకర్ గారు.
మాలాంటి వారికి ఎంతో మంది ఆశలకి పునాది వేసిన వారు దర్శకుడు ఆయన. ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్. నేను వింటేజ్ శంకర్ గారిని మళ్లీ చూశాను. ఒకప్పుడు శంకర్ గారు చేసిన సినిమాలలో నాకు ఒకే ఒక్కడు చాలా ఇష్టమైన సినిమా. మళ్లీ అలాంటి సినిమాను మనం చూడబోతున్నాం. మళ్ళీ అలాంటి ఫీలింగ్ నాకు ఈ సినిమా చూస్తుంటే కలుగుతుంది.
ఒకే ఒక్కడు కంటే పదింతలు ఎక్కువ స్థాయిలో ఈ సినిమా అలరిస్తుంది అని అనుకుంటున్నాను. ట్రైలర్లో చాలా షార్ట్స్ బాగున్నాయి అనిపించింది. ఇక నా బ్రదర్ రామ్ చరణ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. అందరూ అతన్ని చాలా ఎదిగిపోయాడు అని చెబుతున్నారు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అతన్ని చూస్తున్న విధానం చాలా గొప్పగా ఉంది. మగధీర సినిమా టైంలో రామ్ చరణ్ ను నేను హీరో అని పిలిచేవాడిని. ఇప్పుడు అతను ఈ స్థాయిలో ఉండడం చాలా సంతోషంగా ఉంది.
ఈ ట్రైలర్ లో కూడా హెలికాప్టర్ లో లుంగీలో వస్తున్న షాట్ చూస్తూ ఉంటే ఆడియన్స్ ఎలా ఫీలవుతారో అర్థమవుతుంది. కేవలం మాస్ సీన్స్ లలో మాత్రమే కాకుండా ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా నటించగలడు. ఇక డాన్స్ గురించి చెప్పనవసరం లేదు. నెక్స్ట్ టైమ్ అయితే గుర్రం షార్ట్స్ చేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే అవి నా షార్ట్స్. అవి నా రైట్స్. అలాంటి షాట్స్ ఎవరికీ చేయడానికి కుదరదు అంటూ రాజమౌళి సరదాగా అందరిని నవ్వించారు. జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లోకి రాబోతోంది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాట్లుగా రాజమౌళి వివరణ ఇచ్చారు.